పైరవీలు షురూ! | Sakshi
Sakshi News home page

పైరవీలు షురూ!

Published Mon, Sep 8 2014 1:35 AM

Employees Ministers lobbying in Vizianagaram

విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో కొందరు ఉద్యోగులు మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈసారి బదిలీ తప్పదని తెలిసిన ఉద్యోగులు వాటిని నిలుపుదల చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మే రకు బదిలీని నిలుపుదల చేయూలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పేరుకు ఐచ్ఛిక బదిలీలైనా రాజకీయంగా ఏళ్ల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేసిన వారికి బదిలీలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరుకే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్ర  భుత్వం ఆదేశించడంతో మండల స్థాయి నుంచి డివిజన్, జిల్లా కేంద్రంలోని పెద్ద పెద్ద కార్యాలయాల్లో పని చేస్తున్న వారంతా తమ బదిలీ ప్రక్రియ గురించే మాట్లాడుతున్నారు.
 
 అధికార పార్టీ నాయకులు కూడా తమకు అనుకూలంగా ఉన్న అధికారులను తమ ప్రాంతానికి తెచ్చుకునేందుకు బదిలీల ప్రక్రియలో పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు. తనకు బదిలీ తప్పదని తెలిసిన ప్రతి ఉద్యోగి రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకు నేందుకు ప్రయత్నాలు, పైరవీలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలో గతంలో పని చేసిన వారందరికీ ఉద్వాసన తప్పదని ఇప్పటికే పరోక్షంగా హెచ్చ రికలు పంపిన నేపథ్యంలో ఈ బదిలీల ప్రక్రియ మరింత హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలోని ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులను బదిలీ చేసేందుకు ఇప్పటికే అధికార పార్టీ నాయకులు మండలాల వారీగా జాబితా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, మం త్రులు హైదరాబాద్‌లో కూర్చుని ఒక నిర్ణయానికి వస్తారని కొందరు చెబుతున్నారు.
 
 ఇప్పటికే చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పని చేసిన వారంటే కేంద్రమంత్రి అశోక్ కూడా దూరంగా ఉంచుతున్నట్టు భోగట్టా. దీని ప్రకారం గత ప్రభుత్వ నాయకుల అడుగులకు మడుగు లొత్తిన వారికి స్థాన చలనం తప్పదంటున్నారు. అందులో భాగంగా జిల్లాలో కీలక స్థానాల్లో ఉన్న కొందరు ఉద్యోగులకు కూడా బదిలీ తప్పదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లా కేంద్రంలోని పలు శాఖల్లో పని చేస్తున్న అధికారులు, మండల స్థాయి అధికారులకు కూడా బదిలీలు తప్పవని కొందరు బా హాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు కూడా రోజుకొక అధికారిని టార్గెట్‌గా చేస్తూ.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని మం డలాల్లో తహ శీల్దార్లు, ఎంపీడీఓలకు కూడా స్థాన చలనం తప్పేలా లేదు. ఈ మేరకు చాలా మంది ఉద్యోగులు బదిలీలను ని లుపుదల చేసుకునేం  దుకు సెలవు పెట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.  
 

Advertisement
Advertisement