బాబు చెప్పే మాయ మాటలు కుర్చీలినాల్సిందే.! | Sakshi
Sakshi News home page

బాబు చెప్పే మాయ మాటలు కుర్చీలినాల్సిందే.!

Published Fri, Apr 5 2019 12:15 PM

Empty Chairs In CM Chandrababu‘s Meeting - Sakshi

సాక్షి, ప్రకాశం: ‘‘బాగున్నారా తమ్ముళ్లూ.. ఐదేళ్లూ పాలన బ్రహ్మాణ్నంగా చేశాం. అందరూ ‘మళ్లీ మీరే రావాల’నే పరిస్థితికొచ్చారు. వర్షాలు కురవకపోయినా రైతులను ఆదుకునేందు కోస్రం రెయిన్గన్లిచ్చాము. వెలిగొండ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి భూములను సస్యశామలం చేస్తా. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీపోయి ధర్నా చేస్తే అందరూ మనల్నే చూశారు. పార్లమెంట్‌లో హోదా కోస్రం పోరాడింది మన ఎంపీలే. మనం రాజీనామాలు చేసేందుకు ముందుకొస్తే ఈ నరేంద్ర మోడీ భయపడ్డాడు. అటుపక్క కేసీఆర్‌ను చూస్తే డ్రామాలాడుతున్నాడు. మోసం చేసేవాళ్లను నమ్ముతారా.. గట్టిగా రెండు చేతులూ పైకెత్తి మీ మద్దతు తెలపండి. మరొక్కసారి అడుగుతున్నా.. మోసం చేసే వాళ్లను నమ్ముతారా..?’’ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సభల్లో ఇదీ సీఎం చంద్రబాబుగారి వరుస..

ప్రజలేమనకుంటారోననే బెరుకు లేకుండా గంటల తరబడి చంద్రబాబు ఉపన్యాసాలివ్వడం.. అవి విన్నోళ్లు టీ కొట్లు, రచ్చబండల మీద చర్చకు పెట్టడం(బాబు గారి మాటల గారడీపై ఎల్లో మీడియా ఎలాగూ చర్చలు పెట్టదులెండి).. ఎన్నికల సమయం కదా.. ఎక్కడ నలుగురు    కలిసినా చంద్రబాబు గారి హామీలు, ఆయన చెబుతున్న మాటలే సెంటర్‌ పాయింట్‌. 

‘‘రైతుల రుణాలు మొత్తం ఒకేసారి మాఫీ చేస్తానన్నాడు ఎక్కడ చేశాడు.. ఇరవై వేలో, ముప్పై వేలో వస్తే వడ్డీకిపాయె. ఇంకెక్కడ ఆయన మాఫీ చేసింది. బాబు సీఎం అయినప్పుడు డ్వాక్రా రుణాలు రూ.11 వేల కోట్లుంటే.. ఇప్పుడు పాతిక వేల కోట్లయింది. బాబు కుర్చీ ఎక్కినప్పటి నుంచి చినుకు రాలిందా చెప్పు.. నీళ్లు చెమ్మ లేకుండా రెయిను గన్నులు ఏమి చేసుకోను’’. ‘‘ఏమీ చేయకుండా అన్నీ చేశానని చెప్పుకుంటే జనం నమ్ముతరా. మళ్లీ.. ‘తమ్ముళ్లూ నన్ను నమ్మండి.. నమ్మండి’ అని ఓట్ల కోసం దేబిరిస్తున్నాడు. ఆ తెలుగుదేశపోళ్లు కూడా చంద్రబాబు చెప్పే మాటలినలేక సభలకు కూడా పోవడం లేదు. కుర్చీలన్నీ ఖాళీగుంటున్నాయి. బాబు చెప్పే మాటలు ఆ కుర్చీలినాల్సిందే’’.

‘‘ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం జగన్‌ పోరాడుతుంటే మద్దతివ్వకుండా ఎదురు తిట్టిండు. జనమంతా జగన్‌ పక్కకు ఎక్కడ పోతారోనని హోదా కావాలని డ్రామా ఆడుతున్నాడు. నల్లచొక్కా ఒకటేసుకుని ఊర్లమ్మటి తిరిగి గవర్నమెంట్‌ సొమ్ము కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ పనేదో ముందే చేసుంటే ఈపాటికి హోదా వచ్చేది కదా..’’  ‘‘ఆ వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తానని నాలుగుసార్లు తిరిగిండు. అదిప్పటి వరకు పూర్తి కాలేదు..’’  రచ్చబండల మీద చర్చలు ఇలా సాగిపోతున్నాయ్‌.

Advertisement
Advertisement