నిరుద్యోగులకు ఉపాధి భరోసా! | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ఉపాధి భరోసా!

Published Wed, Oct 23 2013 3:03 AM

Ensuring that unemployed!

మహ బూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) నిరుద్యోగులకు ఉపాధితో పాటు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీ సుకుంటున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)వీరఓబులు తెలి పారు. ఆర్థికంగా ఎదిగిన మిగతా కులాలవారితో సమానంగా ఎస్సీలు అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ చొరవతో జిల్లాలో ప్రత్యేకంగా నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈడీ మంగళవారం కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న పలు ఉపాధి పథకాల వివరాలను వెల్లడించారు.
 
 ఉద్యోగమేళాలు
 ఈనెల 25న నారాయణపేటలోని పోలెపల్లి ఫంక్షన్ హాల్‌లో, 31న నాగర్‌కర్నూల్‌లోని సాయి గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో, న వంబర్ 7న మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో,నవంబర్ 22న గద్వాల లోని బృందావన్ గార్డెన్స్‌లో ఉ ద్యోగమేళాలు నిర్వహిస్తున్నామని తెలిపా రు. సెక్యూరిటీగార్డు పోస్టుకు 7వ తరగతి, మార్కెటింగ్, సేల్స్‌మెన్ పోస్టులకు 10వ తరగతి నుంచి డిగ్రీ, కార్పొరేట్ ఆస్పత్రు ల్లో నర్సు ఉద్యోగానికి ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, కంప్యూటర్ ఆపరేటర్ లేదా డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్‌మీడియట్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులని వెల్లడించారు. ఉద్యోగ మేళాలో పాల్గొనే వా రు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పా టు ఒక సెట్ జిరాక్స్‌కాపీలు తీసుకురావాల్సిందిగా సూచించారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన వారు మాత్రమే అర్హులని ప్రకటించారు. ఇదిలాఉండగా ఉపాధి కోసం సబ్సిడీతో కూడిన రుణాలు పొం దేందుకు అవసరమైన దరఖాస్తులను జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కో రారు. సబ్సిడీ కింద కిరాణాషాపు, గొర్రెల పెంపకం, పాల డెయిరీ, వస్త్రదుకాణం, జిరాక్స్, కూల్‌డ్రింక్స్ షాపు, టైలరింగ్ తదితర యూనిట్ల నిర్వహణ కోసం రూ.30 వేల వరకు సబ్సిడీరుణం పొందే అవకాశం ఉందని వెల్లడించారు.
 
 జిల్లాకు 3975 యూనిట్లు
 జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 3975 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించినట్లు వివరించారు. బ్యాంకు నుంచి రుణం ఇస్తున్నట్లు ఆయా బ్యాంకుల మేనేజర్లు అనుమతి లెటర్లు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మంజూరు చేయాల్సిన సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుందని వెల్లడించారు. ప్రతి లబ్ధిదారుని పేరిట ఎస్‌బీ ఖాతాతో పాటు లోన్‌అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
 
 ఆంధ్రాబ్యాంకు, ఏపీజీవీబీ, బీఓబీ, సీబీ, సీబీఐ, కార్పొరేషన్ బ్యాంకు, డీసీసీబీ, ఐబీ, ఐఎన్‌జీ వైశ్యా, ఐఓబీ, పీఎన్‌బీ, ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, ఎస్‌ఐబీ, యూబీఐ, యూకో బ్యాంక్, విజయ తదితర ‘ఆన్‌లైన్’ విధానం ఉన్న ఏ బ్యాంకుల నుంచైనా యూనిట్ల ఏర్పాటు కోసం రుణం మంజూరు చేయడానికి అభ్యంతరం లేదని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తెలిపారు. లెటర్ తెస్తే ఇక ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందినట్లేనని ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
 

Advertisement
Advertisement