Sakshi News home page

పారిశ్రామికవేత్త సుబ్బిరెడ్డి ఆత్మహత్య

Published Tue, Mar 25 2014 12:37 AM

entrepreneur subbireddy suicide

పిఠాపురం టౌన్ / యానాం టౌన్, న్యూస్‌లైన్ : పిఠాపురం పట్టణ శివారు చిత్రాడ రైల్వే గేటు వద్ద రైలు కింద పడి ఓ పారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. అనపర్తి మండలం గొల్లల మామిడాడకు చెందిన కర్రి సుబ్బిరెడ్డి (56) యానాంలో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు.
 
యానాం శివారు అడివిపొలంలో ఉన్న శ్రీయానాం స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న ఆయన యానాం చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. యానాం నుంచి ఆయన మోటార్ బైక్‌పై ఆదివారం అర్ధరాత్రి పిఠాపురం పట్టణ శివారు చిత్రాడ రైల్వే గేటు వద్దకు చేరుకున్నారు. బైక్‌ను రోడ్డు పక్కన పెట్టి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
 
ట్రాక్‌మన్ ఇచ్చిన సమాచారంతో సామర్లకోట రైల్వే పోలీసులు సోమవారం  సంఘటన స్థలాన్ని పరిశీలించా రు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుబ్బిరెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సామర్లకోట రైల్వే ఎస్సై గోవిందరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు కారణాలు తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నా మని రైల్వే పోలీసులు చెప్పారు.
 
తొలితరం పారిశ్రామికవేత్త
యానాంలో సుబ్బిరెడ్డి 1984లో శ్రీ యానాం స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. గత 30 ఏళ్లుగా పరిశ్రమను నిర్వహిస్తున్నారు. యా నాం లో ఆయన తొలితరం పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఈయన కుటుంబం యా నాంలోని జిక్రియనగర్‌లో నివసిస్తోంది. సమాచారం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు చిత్రాడకు బయలుదేరి వెళ్లారు.
 
సంతాపం
చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు సుబ్బిరెడ్డి ఆత్మహత్య సంఘటనపై చాంబర్ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధనరావు ద్రిగ్భాంతి వ్యక్తం చే శారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అందరితో మంచిగా మెలిగే సుబ్బిరెడ్డి మరణం.. చాంబర్ ఆఫ్ కామర్స్‌కు, యానాంలో పారిశ్రామిక రంగానికి తీరని లో టన్నారు.
 
సుబ్బిరెడ్డికి చెందిన పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా సుబ్బిరెడ్డి అండగా నిలిచేవారన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement