ఎర్రబెల్లి.. బహిరంగ చర్చకు రావాలి | Sakshi
Sakshi News home page

ఎర్రబెల్లి.. బహిరంగ చర్చకు రావాలి

Published Tue, Sep 17 2013 3:02 AM

ERRABELLI .. Public debate should

నయీంనగర్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ మారడానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన అంశంపై బహిరంగ చర్చకు రావాలని టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కడియం శ్రీహరి సవాల్ విసిరారు. హన్మకొండలోని టీ ఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేసేందుకు తాము డీల్ కుదుర్చుకున్నామని విమర్శించిన దయాకర్‌రావే డీల్ చేయడంలో నేర్పరి అని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి బేరసారాలాడిన ఎర్రబెల్లి అది సాధ్యం కాకపోవడంతో పది మం ది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లో చేరేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఏమైనా అభ్యంతరముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

 పునర్నిర్మాణంలోనూ పాత్ర

 తెలంగాణ సాధనతో టీఆర్‌ఎస్ పాత్ర ముగిసిపోదని, రాష్ర్ట పునర్నిర్మాణంలో తాము కీలకపాత్ర పోషిస్తామని శ్రీహరి స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని, జిల్లా మంత్రులు చిల్లరవేషాలు నిలిపివేసి అధిష్టానంపై ఒత్తి డి తీసుకురావాలని సూచించారు. ఉద్యమ సమయం లో అడ్రస్ లేని నాయకులు తెలంగాణ పూర్తి స్థాయిలో ఏర్పడకముందే తమదే ఘనత అంటూసంబరాలు చేసుకోవడం మూర్ఖత్వమన్నారు.

 స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు మాట్లాడుతూ టీజేఏసీ పిలుపు మేరకు మంగళవారం ప్రతీ గ్రామ, మండల కేంద్రాల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని కోరారు. సమావేశంలో నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రా వు, మర్రి యాదవరెడ్డి, మార్నేని రవీందర్‌రావు, మరుపల్లి రవి, నయీముద్దీన్, రమేష్, కమరున్నీసాబేగం, రహీమున్నీసాబేగం, శ్రీజనాయక్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement