మన్నవరం మందగమనం | Sakshi
Sakshi News home page

మన్నవరం మందగమనం

Published Mon, Apr 6 2015 2:05 AM

మన్నవరం మందగమనం

అంచనా వ్యయం రూ.6వేల కోట్లు 
నేటికి వెచ్చించింది రూ.100కోట్లు
ఐదేళ్లు దాటుతున్నా కనిపించని పురోగతి 
ఎంపీ పరిశీలనలో బయుటపడిన నిజాలు

 
వున్నవరం(శ్రీకాళహస్తి రూరల్): చిత్తూరు జిల్లాకు తలవూనికంగా నిలుస్తుందని అందరూ భావించిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్బీపీపీఎల్ పనులు నత్తనడకన కొనసాగుతున్నారుు. ఐదేళ్లు దాటుతున్నా పది శాతం పనులు కూడా పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6వేలు కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.100 కోట్లు ఖర్చు వూత్రం చేశారు. దీన్నిబట్టి ఇక్కడ పనులు ఏ మేరకు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తిరుపతి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్‌రావు శనివారం వున్నవరం పరిశ్రవులను పరిశీలించడానికి వెళితే కొన్ని నిజాలు బయుటపడ్డారుు.

ఉన్నతాశయంతో వైఎస్సార్ రూపకల్పన

దివంగత వుుఖ్యవుంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నతాశయంతో 2009లో శ్రీకాళహస్తి వుండలం వున్నవరం సమీపంలో భెల్-ఎన్టీపీసీ సంయుుక్త భాగస్వావ్యుంతో రూ. 6వేల కోట్ల వ్యయుంతో విద్యుత్ ఉపకరణాల విడి భాగాలు తయూరీ చేసే ప్రాజెక్టు నిర్మించటానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అనుమతులు తీసుకొచ్చారు. దీనివల్ల 6వేల వుందికి ప్రత్యక్షంగాను వురో 20వేల వుందికి పరోక్షంగాను ఉపాధి కల్పించాలని వైఎస్ సంకల్పించారు. అరుుతే వైఎస్సార్ అనంతరం, అప్పటి వుుఖ్యవుంత్రి రోశయ్యు 2010, సెప్టెంబర్ 1న శంకుస్థాపన చేశారు.  

వెచ్చించింది వంద కోట్లు

ఇక్కడ ఎన్బీపీపీఎల్ పరిశ్రవు స్థాపనకు రూ. 6వేలు కోట్లు అంచనా వేశారు. అరుుతే పరిశ్రవు స్థాపించి ఐదేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికి కేవలం రూ.100 కోట్లు వూత్రమే ఖర్చు చేశారు. ఇందులో రూ.75 కోట్లు భవనాలు, రోడ్లు, ప్రహరీగోడ, అంతర్గత రహదారుల నిర్మాణాలకు ఖర్చు చేశారు. అరుుతే ఇప్పటికీ ఫ్యాబ్రికేషన్ పనులు నిర్మాణ దశలోనే ఉన్నారుు. మిగతా రూ.25కోట్లతో చిన్నచిన్న పరికరాలు వూత్రం కొనుగోలు చేశారు.

 2013 నాటికి ఉత్పత్తులు ప్రారంభించాలని...

2013లో ఉత్పత్తులు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. మొదటి విడతలో రూ.1200 కోట్లు వెచ్చించి ఉత్పత్తులు ప్రారంభించాలని అంచనా వేశారు. రెండో విడతలో రూ.4800 కోట్లతో పనులు పూర్తి చేసి పూర్తి స్థారుులో ఉత్పత్తులు సాధించాలని ప్రణాళికలు వేశారు. అరుుతే ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇక్కడ ఉత్పత్తులకు బదులు ఇతర పరిశ్రవుల నుంచి విద్యుత్ ఉపకరణాల విడిభాగాలు కొనుగోలు చేసి విక్రరుుస్తున్నారు. ఇక్కడి ఉత్పత్తులను విదేశాలకు ఎగువుతి చేయూల్సి ఉండగా ఉత్పత్తి లేకపోవడంతో కొనుగోలు చేసుకుని విక్రరుుంచాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇంజనీరింగ్ విభాగంలో ప్రత్యక్షంగా 25 వుందికి, పరోక్షంగా 40 వుందికి వూత్రమే ఉపాధి కల్పించారు.
 

Advertisement
Advertisement