అనంతకు ఘన నివాళి | Sakshi
Sakshi News home page

అనంతకు ఘన నివాళి

Published Tue, Jan 6 2015 3:02 AM

అనంతకు ఘన నివాళి

అనంతపురం అగ్రికల్చర్ : అనంతపురం జిల్లా అభ్యున్నతికి అనంత వెంకటరెడ్డి ఎనలేని కృషి చేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో అనంత వెంకటరెడ్డి 15వ వర్థంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, సీపీఐ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా విశేష సేవలు అందించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ నేతలు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, హెచ్.నదీంఅహ్మద్, సిద్ధారెడ్డి, మీసాల రంగన్న, బోయ తిప్పేస్వామి, నార్పల సత్యనారాయణరెడ్డి తదితరులు కొనియూడారు. మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని వైఎస్సార్ సీపీ ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా పేర్కొన్నారు.

రాజకీయాల్లో విలువలు పాటించి, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారని  తెలిపారు. నిజాయితీ, చిత్తశుద్ధి తన తండ్రి స్వంతమని అనంతవెంకటరెడ్డి తనయుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఆయన చూపించిన బాటను తూచ తప్పకుండా పాటిస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం జిల్లా అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జలాలు జిల్లాకు తీసుకురావాలని ఆనాడే అనంత వెంకటరెడ్డి ఎంతో తాపత్రపడ్డారని మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

ఫ్యాక్షనిజానికి దూరంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య  బద్ధంగా రాజకీయాలు చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ నేటితరం రాజకీయ నేతలకు ఆదర్శప్రాయుడని తెలిపారు. అనంత వెంకటరెడ్డి అరుదైన రాజకీయ నేత అని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ అన్నారు. సామాన్య జీవితం గడుపుతూ జిల్లా అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీ నేతలతో కలిసి పోరాడిన వ్యక్తిని కొనియూడారు.

మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నేతలు సోమర జయచంద్రనాయుడు, కేటీ శ్రీధర్, దాదాగాంధీ, శంకర్, డాక్టర్ గోవర్దన్‌రెడ్డి, జాన్‌వెస్లీ తదితరులు వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.  సీనియర్ నేత ఎం.వి.రమణ, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, నగర కమిటీ నేతలు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, చింతకుంట మధు, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, మిద్దిభాస్కర్‌రెడ్డి, బండి పరశురాం, నరేంద్రరెడ్డి, బోయసుశీలమ్మ, శ్రీదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement