ముందు 77... తరువాత 98... | Sakshi
Sakshi News home page

ముందు 77... తరువాత 98...

Published Tue, Jul 15 2014 1:29 AM

ముందు 77... తరువాత 98...

 గొల్లప్రోలు : పరీక్షాపత్రాల వేల్యుయేషన్‌లో చేసిన పొరపాట్లు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. గొల్లప్రోలు మాధురి విద్యాలయానికి చెందిన తోట ధనలక్ష్మి లిఖిత గతేడాది(ఎప్పుడు) పదో తరగతి పరీక్షల్లో గణితం మినహా తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో పదికి పది పాయింట్లు సాధించింది. ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ రావడంతో పాటు సాధారణ పరీక్షల్లో మ్యాథ్స్‌లో వందకు వంద మార్కులు(గ్రేడ్-ఏ1) వచ్చేవి.
 
 పబ్లిక్ పరీక్షలో మ్యాథ్స్‌లో 77 మార్కులతో ఎనిమిది పాయింట్లు (గ్రేడ్‌బీ-1) వచ్చాయి. దీంతో విద్యార్థిని తండ్రి వీరవెంకటసత్యనారాయణ, స్కూల్ యాజమాన్యం ఎస్‌ఎస్‌సీ ఎక్జామ్ బోర్డుకు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేశారు. దీంట్లో 98 మార్కులతో ఏ-1గ్రేడ్‌తో పది పాయింట్లు సాధించినట్లు అడిషనల్ జాయింట్ సెక్రటరీ మెమోరాండం జారీ చేశారు. దీంతో విద్యార్థిని లిఖిత అన్ని సబ్జెక్టుల్లోనూ పదికి పది పాయింట్లు సాధించినట్టు మాధురి విద్యాలయ కరస్పాండెంట్ కడారి తమ్మయ్యనాయుడు తెలిపారు. విద్యార్థినిని ప్రిన్సిపల్ లూకోస్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement
Advertisement