కరువు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం : కలెక్టర్ | Sakshi
Sakshi News home page

కరువు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం : కలెక్టర్

Published Sat, Feb 7 2015 3:58 PM

facilities will be provided on drought areas

చిత్తూరు : కరువు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ సిద్ధార్థజైన్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన చౌడిపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కరువు పరిస్థితుల కారణంగా తాగు, సాగు నీరు లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వేసవిలో పశువులకు పశుగ్రాసం అందిస్తామన్నారు. దెద్దూరు గ్రామంలో నాలుగు నెలలుగా తాగునీటి సమస్య ఉందని తమ దృష్టికి వచ్చిందని, వారి సమస్య తీర్చడానికి కృషి చేస్తానని చెప్పారు. మండలంలోని రైతులు రెండు వేల ఎకరాల్లో గస గసాల పంట సాగు చేశారు. ఈ పంటపై ఎకై్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి, అకారణంగా మాపై కేసులు పెట్టారని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఈ కేసులు మాఫీ చేయాలని రైతులు కోరారు.

(చౌడేపల్లి)

Advertisement

తప్పక చదవండి

Advertisement