'అపజయాల కేటుగాడు దిగ్విజయ్‌-ఇనుపగజ్జల పాదచారి రాహుల్‌' | Sakshi
Sakshi News home page

'అపజయాల కేటుగాడు దిగ్విజయ్‌-ఇనుపగజ్జల పాదచారి రాహుల్‌'

Published Mon, Dec 9 2013 2:30 PM

'అపజయాల కేటుగాడు దిగ్విజయ్‌-ఇనుపగజ్జల పాదచారి రాహుల్‌' - Sakshi

హైదరాబాద్: సొంత రాష్ట్రంలో ఓటుకు చెల్లని అపజయాలకేటుగాడు దిగ్విజయ్‌ సింగ్ అని టిడిపి నేత నందమూరి హరికృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రవిభజనలో కపటనాటకసూత్రధారిగా దిగ్విజయ్‌ వ్యవహరించాడని మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రచారం చేసినా ఏ రాష్ట్రంలో విజయమన్నదెరుగని ఇనుపగజ్జల పాదచారి రాహుల్‌ గాంధీ అన్నారు. విభజనతో మండిన తెలుగువాడి ఆవేశం కాంగ్రెస్‌ను ఎలా దావానంలా చుట్టుముట్టి కాల్చిందో ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు.

ఒక్క ఓటు రెండు రాష్ట్రాలుగా విడగొడతామనడం బీజేపీకీ తగునా అని హరికృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రసమైక్యతను కాపాడుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం అన్నారు. తెలుగు జాతి సమైక్యత కోసం పెద్దరికం తీసుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఏ పార్టీ ఎంపీలైనా రాజీనామా లేఖలు తనకు  ఇస్తే, వాటిని ఆమోదింపజేయిస్తానన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement