కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

Published Sun, Sep 1 2013 3:56 AM

Family strife in the young man committed suicide

జగిత్యాల, న్యూస్‌లైన్:    జగిత్యాల పట్టణానికి చెందిన పులి సంపత్(28) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. సంపత్‌కు పట్టణానికే చెందిన రాజ్యలక్ష్మీతో ఆరు నెలల క్రితం పెళ్లయింది. అతడు ఆటోడ్రైవర్‌గా, పెయింటర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజులు కాపురం సజావుగానే సాగింది. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో రాజ్యలక్ష్మీ పుట్టింటికి వెళ్లింది.
 
 ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారి మధ్య సయోధ్య కుదరలేదు. అదే రోజు అతడి వదిన, అత్త సంతోష్‌ను తిట్టారు. భార్య కాపురానికి రాకపోవడం, కేసులు పెడతానని పలుమార్లు బెదిరించడంతో మనస్తాపం చెందని సంతోష్ శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. అత్త కరబూజ గంగు, వదిన లక్ష్మి అపనిందలు వేయడంతో కుంగిపోయి సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు సుశీల, సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడి భార్యతోపాటు అత్త, వదినపై కేసు నమోదు చేశారు.
 

Advertisement
Advertisement