‘పొలం పిలుస్తోంది’లో ప్రతిఘటనలు | Sakshi
Sakshi News home page

‘పొలం పిలుస్తోంది’లో ప్రతిఘటనలు

Published Thu, Aug 14 2014 12:51 AM

Farm, called the' program

రుణ మాఫీ ఎప్పుడు చేస్తారంటూ నిలదీస్తున్న రైతులు
సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న ప్రజాప్రతినిధులు

 
విశాఖ రూరల్ : ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు అడుగడుగునా రైతుల నుంచి ప్రతిఘటనలు ఎదరవుతున్నాయి. రుణమాఫీ ఎప్పుడంటూ గట్టిగా నిలదీస్తున్నారు. ఆ విషయంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు సైతం రైతులకు నచ్చజెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక ఉత్పత్తితోరెతుల ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు రూపకల్పన చేసిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు బుధవారం 80 గ్రామాలను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల అధికారులు, ఎన్‌జీరంగావర్శిటీ శాస్త్రవేత్తలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.

తొలి రెండు రోజులు 40 మండలాల్లో 160 గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6979 మంది రైతులు పాల్గొన్నారు. అనేక సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల ముందు ఏకరువుపెట్టారు. ప్రధానంగా ప్రతీ చోటా రుణమాఫీ విషయంపైనే రైతులు అధికారులను నిలదీశారు. రుణాలు రద్దు చేస్తారా లేదా అన్ని గట్టిగా ప్రశ్నించారు. వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు నీళ్లు నమిలారు. రుణఅర్హత కార్డులు పొందిన కౌలు రైతులు తమకు వెంటనే రుణాలు ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు. వర్షాలు లేక చాలాచోట్ల వరినారు ఎండిపోతున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో కొన్ని పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తామని ప్రకటించారని, వెంటనే ఆ పని చేయాలని కోరారు. మళ్లీ వచ్చే మంగళ, బుధవారాలు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా గ్రామాలను సందర్శిం చనున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement