ఎలా సాగుదాం? | Sakshi
Sakshi News home page

ఎలా సాగుదాం?

Published Sat, May 31 2014 11:58 PM

ఎలా సాగుదాం? - Sakshi

  • పూడుకుపూయిన కాలువలు
  •  చివరి భూములకు అందని నీరు
  •  రైవాడ, పెద్దేరు కాలువకుపూర్తికాని లైనింగ్ పనులు
  •  ఆందోళన చెందుతున్న రైతులు
  •  ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఏడాదిలో మొదటి పంట, అదీ పెద్ద పంట వేసేందుకు  రైతులంతా సిద్ధమవుతున్నారు. వరి, చెరకుతోపాటు అపరాలు, వేరుశనగ,  ఇతర వాణిజ్య పంటలు సైతం వేసేందుకు ఇదే అదును. సాగునీటికి ఇటు రిజర్వాయర్లు, అటు కొండగెడ్డలు, నదులతో అనుసంధానంగా వందలాది  పంటకాలువలు ఎన్నో ఉన్నాయి...అయితే వీటిలో సగానికి పైగా కాలువలు పూడుకుపోయాయి...మరికొన్ని ఆక్రణమలకు గురయ్యాయి... స్లూయీస్‌లు, ఇతర గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. కాల్వల లైనింగ్ పనులు అసంపూర్తిగానే ఉండిపోయాయి...ఇక పొలాలకు నీరందేదెలా?...నిధులున్నా ఏటా  పనుల సా...గతీత కారణంగా వేలాది ఎకరాలకు నీరందడం లేదు...
     
    చోడవరం,న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. జిల్లాలో వరి, చెరకుతోపాటు అపరాలు, వేరుశనగ, ఇతర వాణిజ్య పంటలు సైతం వేసేందుకు ఇదే అదును. అయితే నీటి వనరులు అంతంతమాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో వ్యవసాయానికి పంటకాలువలే కీలకం. ఇటు రిజర్వాయర్లు, అటు కొండగెడ్డలు, నదులతో అనుసంధానంగా వందలాది పంటకాలువలు ఉన్నాయి. అయితే వీటిలో సగానికి పైగా కాలువలు పూడుకుపోయి, ఆక్రణమలకు గురై ఉండగా, కొన్ని  చెరువులు పూడికలు తీసినా స్లూయీస్‌లు, ఇతర గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు.  

    పెద్దేరు రిజర్వాయరు సంబంధించి కుడికాలువ పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. మా డుగుల నుంచి బుచ్చెయ్యపేట ఎర్రవా యు ప్రాంతానికి వచ్చే కుడికాలువకు సుమారె 15 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు జరగలేదు.  దీనివల్ల దిగువన ఉన్న సుమారు ఐదువేల ఎకరాలకు సాగునీటి సమస్యగా ఉంది. రైవాడ జలాశయం కుడికాలువ లక్కవరం ఛానల్ కాలువ పనులు ఐదేళ్లుగా వివిధ కారణాల వల్ల ఆదునీకరణకు నోచుకోలేదు. దీంతో ఈ కాలువ కింద ఆరువేల ఎకరాలకు సాగునీరందలేదు.
     
    నిధులిచ్చినా ఖర్చు చేయని వైనం : గతంలో మంజూరైన నిధులు సకాలంలో ఖర్చుచేయకపోవడంతో అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు పెట్టినా అవి మంజూరు కాలేదు. గత నాలుగేళ్లలో  శారద, బొడ్డేరు పెద్దేరు, తాచేరు నదులతోపాటు పలు కొండగెడ్డలు గట్లు దెబ్బతిన్నాయి. వీటినుంచి పంట భూములకు వెళ్లే పిల్లకాలువలు సుమారు వందకు పైగా కోతకు గురికాగా మరికొన్ని చోట్ల స్లూయీస్‌లు, దెబ్బతిన్నాయి.  1500ఎకరాలకు సాగునీరందిస్తున్న లక్ష్మీపురం పెద్ద చెరువుకు  సరైన కాలువలు లేక నీరు వృథాగా పోతోంది. గొర్రెగెడ్డ, పాలగెడ్డ, తారకరామ మినీ రిజర్వాయర్లకు సాగునీటి కాలువలు పూర్తిచేయకపోవడంతో ఆ రిజర్వాయర్ల నీరు సాగుకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటంలేదు.
     
    మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం: డీఈఈ మాధవి
     
    చోడవరం సబ్‌డివిజన్ పరిదిలో అవసరమైన సాగునీటి కాలువల మరమ్మతుల కోసం గత ఏడేది ప్రతిపాదనలు పంపాం.ఇంకా నిధులు రాలేదు. గత తుఫాన్లకు దెబ్బతిన్న గట్లు పునర్నిర్మించి కాలువల్లో పూడిక తీతక నిధులు మంజూరయ్యాయి. టెండర్లు ఖరారుచేసి పనులు ప్రారంభిస్తాం. మైనర్ ఇరిగేషన్‌లో కాలువల పూడిక తీతకు, స్లూయీస్, సర్‌ప్లస్ గేట్లు నిర్మాణాలకు కూడా ప్రతిపాదనలు పంపాం.
     
    ఏటా ఇదే సమస్య
     రైవాడ కుడికాలువ నుంచి లక్కవరం ఛానల్ వచ్చే కాలువ ఆధునీకరణ పనులు జరగకపోవడంతో ఏటా ఖరీఫ్‌లో సాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. పక్కనుంచే కాలువ వెళుతున్నా చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఖరీఫ్‌కు కూడా సాగునీటి కష్టాలు తప్పేలా లేదు. నిధులు మంజూరైనందున పను లు వెంటనే ప్రారంభించి ఖరీఫ్ మధ్యలోనైనా నీరందించాలి.
     - కర్రి ముత్యాలనాయుడు, లక్కవరం
     

Advertisement
Advertisement