రైతులకు ‘ఆన్‌లైన్’ కష్టాలు! | Sakshi
Sakshi News home page

రైతులకు ‘ఆన్‌లైన్’ కష్టాలు!

Published Wed, Feb 25 2015 12:37 AM

farmers Problems Payment fully bills online

విజయనగరం కంటోన్మెంట్ : ధాన్యం బిల్లుల చెల్లింపుపై ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. బి ల్లుల చెల్లింపును పూర్తిగా ఆన్‌లైన్ చేయడంతో పాటు జిల్లాస్థాయిలో చెల్లింపులను నిలిపివేయడంతో రైతులు నిత్యం జిల్లా కేం ద్రంలోని సివిల్ సప్లైస్   కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు కొనుగోలు కేంద్రాల వ ద్ద రైతుల వారీగా బిల్లులను, ట్రక్ షీట్లు, సంబంధిత మిల్లుల వివరాలతో తయా రు చేసేవారు. రైతులు వాటిని కొనుగోలు కేంద్రాల నుంచి జిల్లా కార్యాలయానికి తీసుకు వచ్చేవారు. ఆ బిల్లులను ఇక్కడ పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఆమోదించిన రెండు మూడు రోజు లకో చెక్కు రాసి బ్యాంకుకు పంపిస్తే బ ల్క్ డెబిటింగ్ జరిగేది. తద్వారా రైతుల ఖాతాల్లో మూడు రోజులకైనా నగదు లా వాదేవీలు జరిగి బిల్లులు జరిగేవి.
 
 కానీ ఇప్పుడు మొత్తంగా ఆన్‌లైన్ విధానాన్ని అవలం బించాలని ఉన్నతాధికా రులు ఆ దేశాలు జారీ చేశారు. దీని ప్రకారం కొనుగోలు కేంద్రాల వద్దే నేరుగా ఆన్‌లైన్ చేస్తే డబ్బులు రాష్ట్ర కార్యాలయం నుంచి నేరు గా రైతుల ఖాతాల్లో పడతాయి. అయితే కొనుగోలు కేంద్రాలు కాకుండా ఐకేపీ కార్యాలయాల్లో ఆన్‌లైన్ చేయించాలని అధికారులు ఆదేశించారు. వీరికి ఈ ఆన్‌లైన్ విధానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వకపోవడంతో అన్ని కేంద్రాల్లోనూ ఆన్‌లైన్ జరగడం లేదు. దీని వల్ల కొన్ని కేంద్రాల నుంచి ఆన్ లైన్ కాకపోవడంతో మాన్యువల్‌గా బిల్లులు చేస్తున్నారు. ఆదేశాలను సక్రమంగా అమలు చేయడం లేదని భావించిన సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు ఇక్కడి జిల్లా మేనేజరు పేరున  వచ్చే నిధులను నిలిపివేశారు. దీంతో మాన్యువల్‌గా బిల్లులు చేసే అవకాశం కూడా లేకపోయింది. మరోపక్క ఆన్‌లైన్   విధానంపై శిక్షణ లేక మండలా ల్లోని ఐకేపీ కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ బిల్లులు జరగక రైతులు జిల్లా కేంద్రానికి వస్తే మీ మండలాల్లోనే ఆన్‌లైన్ చేయిం  చుకు రండని చెప్పడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.
 
    జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ 2. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖాధికారులు కొనుగోలు చేశారు. ఇందు కోసం రూ. 300 కోట్లకు పైగా వెచ్చించారు. కానీ కొంతమంది రైతుల ఖాతాలు జన్‌ధన్‌తో ఇవ్వడంతో ఆయా రై తులకు సంబంధించిన బిల్లుల లావాదేవీలు నిలిచిపోయాయి. అదేవిధంగా ఆన్‌లైన్ పెట్టి దాదాపు పది రోజులవు తోంది. ఈ పది రోజుల పాటు వచ్చిన బిల్లుల్లో చాలా బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. దీంతో దాదాపు 10 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు 3 వేల మందికి పైగా రైతులు బిల్లులు అవ్వక ఇబ్బందులు పడుతున్నారు. సివిల్ సప్లైస్ డీఎం కొన్ని మండలాల ఏపీఎంలతో మా ట్లాడి బిల్లులను ఏ విధంగా చేయాలో అన్న విషయాన్ని ఫోన్‌లోనూ వివరిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. వెం టనే ఈ ఆన్‌లైన్ విధానాన్ని అన్ని మం డలాల సిబ్బందికి అర్ధమయ్యేలా శిక్షణ ఇస్తే బిల్లుల పెండింగ్ ఉండే ఇబ్బందులు తప్పుతాయని రైతులు, ఆయా మం డ లాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.  
 

Advertisement
Advertisement