రీషెడ్యూలుతో నష్టపోయేది రైతులే | Sakshi
Sakshi News home page

రీషెడ్యూలుతో నష్టపోయేది రైతులే

Published Tue, Jul 15 2014 3:25 PM

రీషెడ్యూలుతో నష్టపోయేది రైతులే - Sakshi

రుణాల రీషెడ్యూల్‌ వల్ల నష్టపోయేది రైతులేనని ఆంధ్రప్రదేశ్లో మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య అన్నారు. రీషెడ్యూల్‌పై చంద్రబాబుది ఓమాట..ఆర్‌బీఐది మరో మాటగా ఉందని, ఈ విషయంలో అబద్ధాలు ఆడుతున్నది చంద్రబాబో, రిజర్వు బ్యాంకో తేలాల్సి ఉందని అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చంద్రబాబుపై ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న ఆలోచనలు రుణాలు మాఫీ చేయడానికా లేదా ఎగ్గొట్టడానికా అని ప్రశ్నించారు.

రూ.87వేల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేస్తారో ఎంత మంది రైతులకు చేస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రభుత్వ పాలనే కనిపించడంలేదని చెప్పారు. విభజన బిల్లులో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు పదేళ్లకు సరిపడ ప్రణాళికలు రూపొందించిందని, అక్కడ ఇప్పుడు ఆఫీసులు, కుర్చీలు లేవన్న చంద్రబాబు మాటలు తప్ప ప్రభుత్వపాలన కనిపించడం లేదని అన్నారు. మండల, జడ్పీ పీఠాలను దక్కించుకునేందుకు టీడీపీ చేసిన దౌర్జన్యాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా అన్న అనుమానం కలుగుతుందని రామచంద్రయ్య అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement