కిరాతక తండ్రి | Sakshi
Sakshi News home page

కిరాతక తండ్రి

Published Sun, Jun 10 2018 12:54 PM

father kills daughters in Chittoor district - Sakshi

పాము తన పిల్లలను తానే తింటుందని పెద్దలు చెబుతుంటారు. అలాంటి ఘటనే చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లె వద్ద శనివారం వెలుగుచూసింది. ఒక వ్యక్తి తాను మనిషి నన్న విషయాన్ని మరిచిపోయాడు. ఆస్తి కోసం కన్నబిడ్డలకు పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం తాను కూడా కొద్దిగా విషం తాగాడు. ఈ ఘటన మనసున్నవాళ్లను కలచివేస్తోంది. 

చిత్తూరు రూరల్‌ / చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని ఓటీచెరువుకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (38) తన ఇద్దరు కూతళ్లు యోగశ్రీ (15), కుసుమిత (10)కు పురుగుల మందు తాగించి చంపేశాడు. అతను కొద్దిగా పురుగుల మందు తీసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానికులు, పోలీసు కథనం మేరకు.. ఓటీచెరువుకు చెందిన ఆనందరెడ్డి, పుష్ప దంపతులకు చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్యం కారణంగా మాధవి ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందింది. మద్యానికి బాని సైన చంద్రశేఖర్‌రెడ్డి పలువురు మహిళలతో వివా హేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇతని తల్లిదండ్రులకు ఓటీచెరువు వద్ద పక్కాఇల్లు ఉంది. 

దాన్ని తన పేరిట రాయాలని, లేదాఅమ్మేసి వాటా ఇవ్వాలని గొడవ పడేవాడు. శుక్రవారం ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టాడు. రక్తగాయాలైన తల్లి రక్తమోడుతూనే పోలీసులకు ఫిర్యాదు చేశా రు. సీఐ వెంకటకుమార్‌ స్పందించి చంద్రశేఖర్‌రెడ్డిని స్టేషన్‌కు పిలి పించారు. ఇంటిని తన మనవరాళ్లు యోగశ్రీ, కుసుమిత పేరిట రాస్తామని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. పోలీసులు ఇక మీదట తల్లిదండ్రులపై దాడి చేయనని చంద్రశేఖర్‌రెడ్డితో రాయించుకుని శనివారం స్టేషన్‌కు రావాలని చెప్పి పంపించేశారు. 

తల్లిదండ్రులకు గుణపాఠం చెప్పాలని..
పోలీసుల ఎదుట తనకు అవమానం జరగడంతో తల్లిదండ్రులకు గుణపాఠం చెప్పాలని చంద్రశేఖర్‌రెడ్డి భావించాడు. తల్లిదండ్రుల వద్ద ఉన్న చిన్న కుమార్తెను స్నేహితుడి ద్వారా ఇంటికి రప్పించా డు. ఇంటిలో ఉన్న పెద్ద కుమార్తె యోగశ్రీ, చిన్నకుమార్తె కుసుమితను శుక్రవారం రాత్రి బైక్‌లో తీసుకుని వెళ్లిపోయాడు. శనివారం ఉదయం చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లె వద్ద అపస్మా రక స్థితిలో పడున్నాడు. ఇక్కడున్న చెరువు వద్ద ఇద్దరు పిల్లలు నోట్లో నురగలు వచ్చి అచేతనంగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి అంబులెన్సులో చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పిల్లలు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కొన ఊపిరితో ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని వేలూరు సీఎంసీకి తరలించారు.

 బీఎన్‌ఆర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాలను తమకు అప్పగించాలని బంగారుపాళ్యం మండలం కూరువాయిపల్లికి చెందిన యోగ శ్రీ తాత సాంబశివరెడ్డి, అమ్మమ్మ క్రిష్ణమ్మ కోరారు. చీకటి పడడంతో ఆదివారం తీసుకెళ్తామని చెప్పడంతో ప్రభుత్వ ఆస్పతిలోనే ఉంచారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పిల్లల అవ్వాతాతలు ఆనందరెడ్డి, పుష్పను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం చేస్తామన్నారు. 

చదువుల తల్లి యోగశ్రీ..
చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద కుమార్తె యోగశ్రీ పదో తరగతిలో మంచి మార్కులతో పాసయింది. అలాగే ఇటీవల విడుదలైన ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ గ్రూపు నుంచి పదికి పది పాయింట్లు సాధించింది. కళాశాల టాపర్‌గా ఉన్న ఆమెను అధ్యాపకులు సైతం అభినందించేవారు. ఇక కుసుమిత ఐదో తరగతి చదువుతోంది. న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఈ ఘటనలో పోలీసులు కాస్త శ్రద్ధ పెట్టి ఆచోచించి ఉంటే.. తల్లిదండ్రులను కొట్టినందుకు చంద్రశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి ఉండేవాళ్లు. దీంతో రెండు ప్రాణాలు కాపాడినట్లయ్యేది. అలా కాదని కోపంతో ఉన్న వ్యక్తిని, అతని చేతిలో దెబ్బలు తిన్నవాళ్లను ఒకేసారి పంపించేయడంతో ఈ ఘోరం జరిగింది.

Advertisement
Advertisement