Sakshi News home page

ఖరీఫ్ ఎరువుకు గ్యాస్ దెబ్బ

Published Sun, Jul 20 2014 3:29 AM

ఖరీఫ్ ఎరువుకు గ్యాస్ దెబ్బ

నగరం పేలుడుతో మూతపడ్డ ఓఎన్‌జీసీ బావులు.. నిలిచిన గ్యాస్ సరఫరా
 
గ్యాస్ సరఫరా లేక ఎరువులు, విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తికి 20 రోజులుగా బ్రేక్
ఒక్క నాగార్జున కర్మాగారంలోనే నిలిచిపోయిన రోజుకు 5,000 టన్నుల ఉత్పత్తి
ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా6 రాష్ట్రాలకు ఆగిన యూరియా సరఫరా
ఆగస్టు వరకు విదేశీ యూరియా దిగుమతులు రావడం కష్టమే.. దిగుమతి చేసుకున్న ఎరువులతో కేంద్రంపై పెరగనున్న భారం
ఈ ఖరీఫ్‌లో వ్యవసాయానికి యూరియా కటకట తప్పదు: యూరియా సంస్థలు
విద్యుత్ ప్లాంట్లకూ గ్యాస్ కొరత దెబ్బ - 750 మెగావాట్ల ఉత్పత్తికి బ్రేక్

కాకినాడ:  కృష్ణా - గోదావరి బేసిన్‌లో ఓఎన్‌జీసీ గ్యాస్ బావులు మూతపడటంతో.. గ్యాస్ సరఫరా లేక ఎరువుల ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఫలితంగా ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయానికి ఎరువులకు తీవ్ర కొరత ఎదురుకానుంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని నగరం గ్రామంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) గ్యాస్ పైపులైన్ పేలుడుతో సహజ వాయువు ఉత్పత్తి చేసే సుమారు 70 ఓఎన్‌జీసీ బావులు మూతపడి మూడు వారాలైంది. దాంతో సహజ వాయువు సరఫరా నిలిచిపోయి, గ్యాస్‌పై ఆధారపడ్డ విద్యుత్, ఎరువుల ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. బావుల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కాదని పైపులైన్ల నాణ్యతపై సర్వే చేస్తున్న ‘ఇంజనీర్స్ ఇండియా’ అభిప్రాయపడుతోంది. గ్యాస్ సరఫరా లేక ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్స్ మూమెంట్స్ ఆర్డర్ ఆధారంగా జరగాల్సిన యూరియా సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో యూరియా అవసరాల్లో దాదాపు సగం యూరియా కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారం తీరుస్తుంటుంది. గ్యాస్ సరఫరా లేక యూరియా ఉత్పత్తి నిలిచిపోగా మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా కూడా ఆగస్టు నెలాఖరు వరకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఖరీఫ్‌లో యూరియా కొరత పెనుసమస్య కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
‘నాగార్జున’లో నిలిచిన ఉత్పత్తి

 నాగార్జున కర్మాగారంలో గ్యాస్ సరఫరా జరిగే రోజుల్లో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగాఏటా సుమారు20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. గెయిల్ నుంచి నాగార్జునలోని రెండు ప్లాంట్లకు రోజుకు 3.15 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావాలి. వాస్తవంగా గెయిల్ నుంచి సరఫరా అవుతున్నది 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లే. నగరం పైపు లైన్ పేలుడు తరువాత ఆ సరఫరా కూడా నిలిచిపోయింది. 20 రోజులుగా నాగార్జునలో 14.50 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ ఉత్పత్తయ్యే యూరియా ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం నిర్ణయించే కోటా ప్రకారం రైల్వే ర్యాక్‌ల ద్వారా సరఫరా చేస్తుంటారు. సరఫరా నిలిచిపోవడంతో నాగార్జున రోజుకు సుమారు రెండు కోట్ల టర్నోవర్‌ను కోల్పోయింది. పునర్విభజనకు ముందున్న రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా. దీన్లో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నులు నాగార్జున కర్మాగారంలో ఉత్పత్తి అయితే 26 లక్షల టన్నులు ఒమన్, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవలసి ఉంది. యూరియా ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల కిందట కేంద్ర పెట్రోలియం మంత్రిని, గెయిల్ చైర్మన్‌ను కలిసి గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకుంటే ఎరువులకు కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం రైతులకు టన్ను యూరియాను రూ. 5,500కు విక్రయిస్తుండగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా టన్నుకు 350 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) అవుతుంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్న యూరియా కేంద్ర సర్కారుకు భారమవుతోంది.
 
మూతపడ్డ పవర్ ప్లాంట్లు...

గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా రాష్ట్రాన్ని పీడిస్తోంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ స్పెక్ట్రమ్, ల్యాంకో, విజ్జేశ్వరం, జెన్‌కో తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఓఎన్‌జీసీ బావులతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల బావుల్లో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ బావుల నుంచి గెయిల్ విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్‌కో, ఉప్పాడ తీరంలోని స్ప్రెక్టమ్ తదితర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు రోజూ సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాక 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. 20 రోజులుగా సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 100 నుంచి 150 మెగావాట్లు ఉత్పత్తి చేసే విజ్జేశ్వరం, స్పెక్ట్రమ్ ప్లాంట్‌లు, సుమారు 200 మెగావాట్లు ఉత్పత్తి చేసే వేమగిరి పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్లు ఉత్పత్తిచేసే ల్యాంకో పవర్‌ప్రాజెక్టు మూతపడ్డాయి. గెయిల్ పైపులైన్లను అధ్యయనం చేస్తున్న ఇంజనీర్స్ ఇండియా నివేదిక వచ్చేసరికి ఎంతలేదన్నా రెండు, మూడు నెలలు పడుతుందని ఓఎన్‌జీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా, విద్యుత్ కొరతలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ఖరీఫ్‌లో యూరియా కొరత పెనుసమస్య కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

‘నాగార్జున’లో నిలిచిన ఉత్పత్తి

 నాగార్జున కర్మాగారంలో గ్యాస్ సరఫరా జరిగే రోజుల్లో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగాఏటా సుమారు20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. గెయిల్ నుంచి నాగార్జునలోని రెండు ప్లాంట్లకు రోజుకు 3.15 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావాలి. వాస్తవంగా గెయిల్ నుంచి సరఫరా అవుతున్నది 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లే. నగరం పైపు లైన్ పేలుడు తరువాత ఆ సరఫరా కూడా నిలిచిపోయింది. 20 రోజులుగా నాగార్జునలో 14.50 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ ఉత్పత్తయ్యే యూరియా ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం నిర్ణయించే కోటా ప్రకారం రైల్వే ర్యాక్‌ల ద్వారా సరఫరా చేస్తుంటారు. సరఫరా నిలిచిపోవడంతో నాగార్జున రోజుకు సుమారు రెండు కోట్ల టర్నోవర్‌ను కోల్పోయింది. పునర్విభజనకు ముందున్న రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా. దీన్లో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నులు నాగార్జున కర్మాగారంలో ఉత్పత్తి అయితే 26 లక్షల టన్నులు ఒమన్, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవలసి ఉంది. యూరియా ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల కిందట కేంద్ర పెట్రోలియం మంత్రిని, గెయిల్ చైర్మన్‌ను కలిసి గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకుంటే ఎరువులకు కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం రైతులకు టన్ను యూరియాను రూ. 5,500కు విక్రయిస్తుండగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా టన్నుకు 350 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) అవుతుంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్న యూరియా కేంద్ర సర్కారుకు భారమవుతోంది.

మూతపడ్డ పవర్ ప్లాంట్లు: గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా రాష్ట్రాన్ని పీడిస్తోంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ స్పెక్ట్రమ్, ల్యాంకో, విజ్జేశ్వరం, జెన్‌కో తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఓఎన్‌జీసీ బావులతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల బావుల్లో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ బావుల నుంచి గెయిల్ విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్‌కో, ఉప్పాడ తీరంలోని స్ప్రెక్టమ్ తదితర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు రోజూ సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాక 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. 20 రోజులుగా సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 100 నుంచి 150 మెగావాట్లు ఉత్పత్తి చేసే విజ్జేశ్వరం, స్పెక్ట్రమ్ ప్లాంట్‌లు, సుమారు 200 మెగావాట్లు ఉత్పత్తి చేసే వేమగిరి పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్లు ఉత్పత్తిచేసే ల్యాంకో పవర్‌ప్రాజెక్టు మూతపడ్డాయి. గెయిల్ పైపులైన్లను అధ్యయనం చేస్తున్న ఇంజనీర్స్ ఇండియా నివేదిక వచ్చేసరికి ఎంతలేదన్నా రెండు, మూడు నెలలు పడుతుందని ఓఎన్‌జీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా, విద్యుత్ కొరతలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
Advertisement
Advertisement