ఫర్టిలైజర్ దుకాణాల సీజ్ | Sakshi
Sakshi News home page

ఫర్టిలైజర్ దుకాణాల సీజ్

Published Fri, Sep 20 2013 2:41 AM

fertilizers shops are siezed

 మద్నూర్,న్యూస్‌లైన్:
  మద్నూర్ మండల కేంద్రంలో రెండు ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయశాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. వ్యవసాయశాఖ అధికారులు వస్తున్నారని తెలిసి వ్యాపారులు ఫర్టిలైజ ర్ దుకాణాలు మూసివేసి వెళ్లడంతో అక్ర మ, కల్తీ ఎరువులు విక్రయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ సీజ్ చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు.మండ ల కేంద్రంలోని సంగమేశ్వర, గ్రోమోర్ దుకాణాలను సీజ్ చేసినట్లు జేడీఏ నర్సిం హ, ఏడీఏ వేణుగోపాల్ తెలిపారు.
 
 వ్యవసాయశాఖ అధికారులు దుకాణాలను తనిఖీ చేస్తున్నారని తెలిసి ఉద్దేశపూర్వకంగా ఇరు దుకాణాలను యజమాను లు మూసివేశారని అధికారులు తెలిపారు.అలాగే మండల కేంద్రంలోని దుకాణాలలోని 800 శాంపిల్స్‌ను టెస్ట్‌లకు పంపించగా, అందులో 300 ఉత్పత్తుల లో పెస్టిసైడ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎరువుల దుకాణాలకు లెసైన్స్‌లు పొం ది, ఫెస్టిసైడ్స్‌ను విక్రయించడం  తనిఖీ ల్లో తేలిందని, వారిపై చర్యలు తీసుకుం టామని అధికారులు తెలిపారు. అలాగే స్థానిక వ్యాపారులు బయోప్రోడక్ట్స్ మిశ్ర మం ఉన్న ఎరువులు విక్రయిస్తున్నట్లు రికార్డులు చూపించినప్పటికి, అందులో అసలు బయోప్రోడక్ట్స్ లేదని తేలింది.  పూర్తి విచారణ చేపట్టి జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి  చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా నాసిరకం ఎరువులు, ఫెస్టిసైడ్స్ విక్రయిస్తే త మ దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అధికారుల వెం ట ఏఈవో లుకా,లక్ష్మీకాంత్ ఉన్నారు.
 
 

Advertisement
Advertisement