బస్సులో సీటు కోసం గొడవ, విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

బస్సులో సీటు కోసం గొడవ, విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Published Fri, Aug 23 2013 2:59 AM

Fight for Bus Seat, Student attempts suicide

ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ :  బస్సులో సీటు కోసం ఇద్దరు విద్యార్థినుల మధ్య వివాదం తలెత్తింది. మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. మహారాష్ట్రలోని కిన్వట్ లో ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని ప్రస్తు తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనకు సంబంధించి పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నారుు. మహా రాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన ప్రియూంక స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోం ది. రోజూ బస్సుల్లోనే పాఠశాలకు వచ్చిపోతుం ది. గురువారం పాఠశాలకు బస్సులో వస్తుం డగా సీటు విషయమై మరో విద్యార్థిని అఖిలతో వాగ్వాదం తలెత్తింది. ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రియూంక బస్సు దిగగానే దుకాణంలో ఎలుకల మందు కొని తాగింది. ఆ విషయూన్ని పాఠశాల సిబ్బందికి తెలపడంతో వారు వెంటనే ఆమెను కిన్వట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రియూంక కోలుకుంటోందని పాఠశాల ఉపాధ్యాయుడు స్వామి తెలిపారు.  
 
అధికారి మందలించాడని అటెండర్..
బెల్లంపల్లి రూరల్ : అధికారి మందలించాడని మండలంలోని ఎంపీడీవో కార్యాలయ అటెండర్ మహంకాళి క్రాంతి గురువారం అత్మహత్యకు యత్నించాడు. త్రీటౌన్ ఏఎస్సై వెంకన్న తెలి పిన వివరాల ప్రకారం.. క్రాంతి కార్యాలయం తాళంచెవి తనవద్ద ఉంచుకుని సాయంత్రం ఆఫీసుకు వచ్చాడు. దీంతో ఈసీ రాజేందర్ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. మనస్తాపానికి గురైన క్రాంతి ఇంటికి వెళ్లి సూపర్ వాస్మోల్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ఆస్పత్రికి, అనంతరం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వివరించారు.
 
జీవితంపై విరక్తితో మహిళ..
మంచిర్యాల రూరల్ : జీవితంపై విరక్తి చెంది మహిళ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని ముల్కల్ల పంచాయతీ పరిధి లంబాడితండాలో జరిగింది. హాజీపూర్ ఎస్సై ఎం.రవీందర్ కథనం ప్రకారం.. లంబాడితండా కు చెందిన బానోతు రజితకు నాలుగేళ్ల క్రితం వివాహమవగా ఆరు నెలలకే విడాకులు తీసుకుని పుట్టింట్లో ఉంటోంది. జీవితంపై విరక్తి చెం దినట్లు మాట్లాడుతూ  చస్తానని కుటుంబ స భ్యులను బెదిరిస్తుండేది. ఈ క్రమంలో గురువా రం కుటుంబ సభ్యులు గ్రామంలో జరిగిన బం ధువు వివాహానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రజిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలు ఆర్ప గా కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికి త్స కోసం రజితను కరీంనగర్‌కు తరలించారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్సై వివరించారు.
 

Advertisement
Advertisement