కాపు కార్పొరేషన్‌ ఆఫీసులో రగడ

16 Oct, 2017 01:34 IST|Sakshi

 చైర్మన్‌ రామానుజయ, ఎండీ అమరేంద్రకుమార్‌ల మధ్య వాగ్వాదం

కార్యాలయంలో ఎండీ విలేకరుల సమావేశాన్ని అడ్డుకున్న చైర్మన్‌

తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమన్న ఎండీ

సాక్షి, అమరావతి: కాపు కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి 8.30 వరకూ హైడ్రామా నడిచింది. కార్పొరేషన్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆదివారం 8 గంటలకు విలేకరుల సమావే శాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ అమరేంద్ర కుమార్‌ మీడియాకు సమాచారమిచ్చారు. విలేకరులు చేరుకునే సమయంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ కూడా అక్కడకు వచ్చారు. ఆదివారం కార్యాలయ రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉందని రామానుజయ అనుమానం వ్యక్తం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ విలేకరుల సమావేశం నిర్వహించకూడదని అమరేంద్రకుమార్‌ను ఆదేశించారు. అయితే తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతానని అమరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. దాంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు ఎండీ అమరేంద్రకుమార్‌ కార్యాలయం బయట రోడ్డుపైనే విలేకరులతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని వెల్లడిం చారు. విద్యోన్నతి పథకం కింద శిక్షణ తీసుకున్నవారికే ఫీజులు చెల్లించామన్నారు. ఉద్యోగ మేళాలు ఆయా జిల్లాల కలెక్టర్‌ల నేతృత్వంలో జరిగాయని.. వాటి ఖర్చులతో తనకు సంబంధం లేదన్నారు. నిబంధనలకు లోబడే తన తల్లి వైద్య ఖర్చులకు నిధులను వినియోగించానన్నారు.  2016కు ముందటి అంశాలతో తనకు సంబంధం లేదన్నారు. 

మాతృశాఖకు ఎండీ సరెండర్‌
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ రేంద్రకుమార్‌ను మాతృశాఖ (పశు సంవర్థక)కు  సరెండర్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కార్పొరేషన్‌ కార్యాలయం లో ఎక్కువమందిని ఔట్‌సోర్సింగ్, కాంట్రా క్ట్‌పై తీసుకున్నారు. వీరి ద్వారా నిధుల దుర్వినియోగానికి ఎండీ పాల్పడినట్లు ఉన్న తాధికారుల పరిశీలనలో వెల్ల్లడైంది. ఎన్‌టీఆర్‌ విద్యోన్నతి పథకం అమలు తీరుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు