‘తేజ్‌దీప్ కేసులో వారంలో చార్జిషీటు వేయండి’ | Sakshi
Sakshi News home page

‘తేజ్‌దీప్ కేసులో వారంలో చార్జిషీటు వేయండి’

Published Sat, Dec 7 2013 5:19 AM

File chargesheet against Tejdeep Kaur Menon within one week: High court

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేమనే అభిప్రాయం ప్రజల్లో కలగరాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్ కౌర్ మీనన్‌పై నమోదైన కేసులో వారం లోపు చార్జిషీట్ దాఖలు చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని డీజీపీకి స్పష్టం చేసింది.
 
 ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తేజ్‌దీప్ కౌర్ మరికొందరు తన ఇంట్లోకి వచ్చి తన పట్ల దురుసుగా ప్రవర్తించి దూషించారంటూ జి.హరిత అనే మహిళ 2003లో బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి పదేళ్లయినా, కేసులో దర్యాప్తు పూర్తయినా కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదన్న కారణం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement