తెలంగాణపై జిఓఎం తుది నివేదిక ఖరారు | Sakshi
Sakshi News home page

తెలంగాణపై జిఓఎం తుది నివేదిక ఖరారు

Published Wed, Dec 4 2013 9:13 PM

Final Report ready on Telangana

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై తుది నివేదిక ఖరారు చేసింది. జిఓఎం ఆఖరి సమావేశం ముగిసింది. ఈ సమావేశం గంటసేపు జరిగింది. గులాంనబీ ఆజాద్ద్ మినహ మిగతా సభ్యలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగిసిన తరువాత  వీరప్ప మొయిలీ  మాట్లాడుతూ జిఓఎం తన పని పూర్తి చేసిందని తెలిపారు. ఇదే జిఓఎం తుది సమావేశమని చెప్పారు. విభజన బిల్లు ఖరారైందని, వివరాలు తాను చెప్పలేనని అన్నారు. సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ రేపు మంత్రి మండలి ముందుకు తెలంగాణ బిల్లు వెళుతుందని చెప్పారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణ, 12 జిల్లాల రాయల తెలంగాణ ఈ రెండు అంశాలను జిఓఎం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) కేంద్ర మంత్రి మండలి ముందుకు ఎప్పుడు వెళ్లాలనేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నిర్ణయిస్తారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement