హోటల్‌లో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

హోటల్‌లో అగ్నిప్రమాదం

Published Mon, Jan 27 2014 3:51 AM

fire accident in hotel

కొత్తకొత్తూరు(నేలకొండపల్లి), న్యూస్‌లైన్: మండలంలోని కొత్తకొత్తూరులోని ఓ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ. 2లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తకొత్తూరులో మాదాసు శ్రీనివాసరావు హోటల్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10 గంటల వరకు హోటల్ నిర్వహించిన ఆయన ఇంటికి వెళ్లిపోయాడు.

 ఆదివారం తెల్లవారుజామున ఆ హోటల్ నుంచి మంటలు వస్తుండడంతో స్థానికులు చూసి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు యత్నించాడు. అప్పటికే హోటల్‌లో ఉన్న రెండు ఫ్రిడ్జ్‌లు, కలర్ టీవీ, ఫ్యాన్, వంట సామగ్రి, ఫర్నిచర్, కేబుల్ టీవీ సామగ్రి, దుస్తులు పూర్తిగా కలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.2లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో కావాలనే హోటల్‌కు నిప్పు పెట్టారని పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నేలకొండపల్లి ఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీరాములు, గ్రామ రెవెన్యూ అధికారి ఆలస్యం మధుసూధన్‌రావులు పంచనామా నిర్వహించారు. సంఘటన స్థలాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నం బ్రహ్మయ్య, సర్పంచ్ గుగులోత్ వీరమ్మ, వివిద సంఘాల నాయకులు పేరాల సత్యనారాయణ, గడ్డం సత్యం, కడియాల నరేష్, పావులూరి వెంకటేశ్వరరావు, పాగర్తి సుధాకర్, జె.సత్యనారాయణ, కోటారి ప్రసాద్ తదితరులు సందర్శంచి చర్యను తీవ్రంగా ఖండించారు. బాధితునికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement