కోట సీతారాంపురంలో అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

కోట సీతారాంపురంలో అగ్ని ప్రమాదం

Published Wed, Mar 9 2016 12:11 AM

fire accident in Kota sitarampuram

సీతానగరం: కోటసీతారాంపురంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.4 లక్షల విలువైన ఆస్తినష్టం సంభవించింది. ఆర్‌ఐ ఫకీరు కథనం ప్రకారం వంగపండు గోపి ఇంట్లో పశువుల దాణా తయారికి మంటపెట్టి బయటికెళ్లాడు. దీంతో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. వంగపండు గోపీ బడ్డీ, పూరిళ్లు, వంగపండు రమణమూర్తి, జి.అప్పారావు బడ్డీలు, వై.ప్రసాద్, కె.గౌరి, వై.సింహాచంలకు చెందిన మూడు కుటుంబాలు ఏడాది పొడవునా తినడానికి శాలల్లో భద్రపరుచున్న 40 బస్తాల ధాన్యం, నిత్యావసర సరుకులు, సిహెచ్.సింహాచలం కోళ్ళఫారంలో 40 కోళ్లు దగ్ధమయ్యూయి.
 
  చప్ప సత్యనారాయణకు చెందిన పాడి ఆవు మంటల్లో చిక్కుకుని గాయపడింది. ఎం.అప్పారావుకు చెందిన ఇంటికలప కాలిబూడిదైంది. వాటితో పాటు 20 పశువుల శాలలు దగ్ధమయ్యూరుు. మరోవైపు ఎండ తాకిడి తీవ్రంగా ఉండటం, ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. బొబ్బిలి నుంచి వచ్చిన అగ్నిమాపక శకటం వచ్చి మంటలను అదుపు చేస్తుండగా నీరు అరుుపోరుుంది.
 
 దీంతో చెరువుకు వెళ్లి నీరు నింపుకొని వస్తున్న సమయంలో వాహనం మొరాయించడంతో ఫలితం లేక పోయింది. బాడంగి నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోగా శాతలలన్నీ కాలి బూడిదయ్యాయి. ప్రమాదస్థలాన్ని ఎస్‌ఐ బి.లక్ష్మణరావు సిబ్బంది వచ్చి పరిశీలించారు. ఆర్‌ఐ, వీఆర్వోలు వచ్చి నష్టం అంచనా వేసారు. సర్పంచ్ కె.వెంకటరత్నం, మాజీ ఎంపీపీ కె లక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు కె.అప్పలనర్సమ్మ, వెంకటరమణ, వెంకటనాయుడులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement