పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనంలో మంటలు | Sakshi
Sakshi News home page

పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనంలో మంటలు

Published Fri, May 29 2015 9:27 AM

fire accident in tata ace vehicle in east godavari district

తొండంగి:  పెళ్లి బృందంతో వెళుతున్న టాటా ఏస్ వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని ఆపేశాడు. దాంతో వాహనంలోని పెళ్లి బృందం కిందకి దూకి ప్రాణాలు దక్కించుకుంది. ఈ సంఘటన శుక్రవారం తుని మండలం తేటగుంట ఆర్టీఏ చెక్పోస్ట్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

శుక్రవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో పెళ్లి వేడుక ముగించుకున్న 10 మంది ...విశాఖ జిల్లా చింతపల్లికి టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. ఆ క్రమంలో వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వాహనం మాత్రం పూర్తిగా తగలబడిపోయింది.

Advertisement
Advertisement