తమ్ముళ్లతో ప‘రేషన్’! | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లతో ప‘రేషన్’!

Published Fri, Jan 22 2016 12:29 AM

Five per cent  commission in TDP  leaders developed work

జన్మభూమి కమిటీల చేతుల్లో రేషన్‌కార్డులు
 ‘జన్మభూమి-మా ఊరు’లో అరకొర పంపిణీ
 కొత్తకార్డుల్లోనూ తప్పుల తడకగా వివరాలు
 సరిదిద్దుకోవడానికి లబ్ధిదారుల అగచాట్లు
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘తెల్ల రేషన్‌కార్డు కావాలా? అయితే నా చేయి తడపాల్సిందే’నని కరాఖండిగా చెబుతున్నాడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బొమ్మూరులో జన్మభూమి కమిటీ సభ్యుడొకరు. అంతేనా.. అభివృద్ధి పనుల్లో ఐదు శాతం కమీషన్ కోసం డిమాండు చేస్తున్నాడు. తెలుగుదేశం వారితో కూడిన జన్మభూమి కమిటీల సభ్యులు పలు గ్రామాల్లో  చేతి ఖర్చులకు సొమ్ము ఇవ్వాలని, లేదంటే ఎమ్మెల్యేకి చెప్పి సంగతి తేల్చుతామని పంచాయతీ కార్యదర్శులనే బెదిరిస్తున్నారు.
 
  రేషన్‌కార్డు లేదా పింఛను దరఖాస్తు ఏదైనా సరే ముందుకు కదలాలంటే రూ.వెయ్యి వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు అమలాపురంలో ఓ వార్డు కౌన్సిలర్. ఇక పలు గ్రామాల్తో ఐఏవై గృహరుణాలకు సైతం రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్‌కార్డులే కాదు పింఛన్లు, ఇళ్లే కాదు.. మరే సంక్షేమ పథకమైనా సరే తుని నియోజకవర్గంలో జన్మభూమి కమిటీల జోక్యం మితిమీరింది. ఎన్టీఆర్ విగ్రహాల పేరుతో పింఛన్‌దారుల్లో ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేసిన నైచ్యానికి దిగజారారుు.
 
 ఈ మూడు చోట్లే కాదు జిల్లాలో చాలాచోట్ల జన్మభూమి కమిటీల తీరు జనం జేబులకు చిల్లు పెట్టేలా, వారు చీదరించుకునేలా ఉంది. తమ పని తాము చేసుకోలేని పరిస్థితి తలెత్తుతోందని అధికారులూ వాపోతున్నారు. వాస్తవానికి తెల్ల రేషన్‌కార్డు పొందాలంటే గతంలో తొలుత గ్రామ కార్యదర్శులు సిఫారసు చేస్తే తర్వాత మండలస్థాయిలో తహశీల్దార్లు వాటిని ఆమోదించేవారు. తర్వాత చౌక డిపోల డీలర్లకు జాబితాలు వెళ్లేవి. ఆ ప్రకారం సరుకులు విడుదల చేసేవారు. టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో సరికొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీనివల్ల అర్హులకు న్యాయం మా టెలా ఉన్నా అనర్హులకు సైతం లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కుతోంది. దీని కోసం రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ వసూలు చేస్తున్నారనే ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. వీరి ఆగడాలను సొంత పార్టీ వారే అసహ్యించుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
 గాడి తప్పుతున్న వ్యవస్థ..
 జన్మభూమి కమిటీల ఆధిపత్యం ఫలితం ఇప్పుడు రేషన్‌కార్డుల జారీలో స్పష్టంగా కనిపిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 2 నుంచి 11 వరకూ జరిగిన మూడో విడత జన్మభూమి-మన ఊరు కార్యక్రమంలో ప్రధానంగా రేషన్‌కార్డుల పంపిణీపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది. మరోవైపు క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు చంద్ర న్న కానుక పేరుతో ఆరు దినుసులను అందజేస్తామని ఘనంగా ప్రకటించింది. దీంతో కొత్త తెల్ల కార్డుల కోసం జిల్లాలో పోటీ ఎక్కువైంది. ఒకవైపు రేషన్‌కార్డుల కోసం మొదటి రెండు విడతల్లో వచ్చిన విజ్ఞాపనలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చే యాలని జిల్లా పౌరసరఫరాల కార్యాల యం నుంచి తహశీల్దార్లకు ఆదేశాలు వె ళ్లాయి. ఉన్న అరకొర సిబ్బందితోనే ఆ వి వరాలన్నీ కంప్యూటర్లలో నమోదు చేశా రు. అయితే ఆ జాబితాలను పక్కనబెట్టి జన్మభూమి కమిటీల సభ్యులు కొత్త జాబితాలను తెరపైకి తెచ్చారు. అంతేకాక అంతకు ముందు జాబితాల్లో తమ కు ఇష్టంలేని, ప్రతిపక్షాలకు చెందినవారి పేర్లను వెతికి మరీ తొలగించారు. ఒకే కు టుంబానికి రెండు మూడు కార్డులు మం జూరైన ఉదంతాలూ జిల్లాలో ఉన్నాయి.
 
 పేర్లే లేకుండా కార్డుల పంపిణీ..
 కొత్త రేషన్‌కార్డుల ఆన్‌లైన్ ప్రక్రియలో గందరగోళం ఫలితంగా అసలు వివరాలే తప్పుగా నమోదయ్యూరుు. జిల్లాకు 1.34 లక్షల కొత్త రేషన్‌కార్డులు మంజూరైతే దాదాపు సగం వరకూ తప్పుల తడకలే. కొన్ని కార్డులు అసలు పేర్లే లేకుండా వ చ్చాయి. కొన్ని కార్డుల్లో పేర్లున్నా బయ టి వ్యక్తుల పేర్లు కలిసిపోయాయి. గత జ న్మభూమి కార్యక్రమాల్లో ఈ కార్డులు వ ద్దంటూ లబ్ధిదారులు గగ్గోలు పెట్టడంతో పదికి మించి ఎక్కడా కార్డులను పంపిణీ చేయకపోరుునా దాదాపు 95 శాతం పంపిణీ చేశామని అధికారులు ప్రకటించేశారు. మరోవైపు తమకు కార్డులందలేదని సగం మంది దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. తమకు రేషన్‌కార్డు ఇప్పించాలంటూ ప్రతిరోజూ వీఆర్వో, తహశీల్దారు కార్యాలయాలకు, జన్మభూమి కమిటీ సభ్యుల ఇళ్లకు తిరుగుతున్నారు.
 
 ఆ కార్డులు ఏమయ్యాయి?
 అన్ని కార్డులూ పంపిణీ చేశామని అధికారులంటుంటే తమకందలేదని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. మ రి అవెక్కడున్నాయంటే.. తెలుగు త మ్ముళ్లకు పదవుల కోసం ప్రభుత్వం సృష్టిం చిన జన్మభూమి కమిటీల చేతుల్లోకి వెళ్లాయని తెలుస్తోంది. తమ వారికి, తమకు రూ.వెయ్యి ముట్టజెప్పే వారికే వాటిని ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తీరా అలా ఇచ్చినా ఆ కార్డుల్లో తప్పులు సరిచేయించుకోవడానికి లబ్ధిదారుల తలప్రాణం తోకకు వస్తోంది. ఈ గందరగోళంతో జనవరి సరుకులు ఎలాగూ రాలేదు. వచ్చే నెలలో సరుకులు అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జన్మభూమి కమిటీల మితిమీరిన జోక్యం వల్లే తమకు రేషన్ సరుకులు అందని పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు వాపోతున్నారు.
 

Advertisement
Advertisement