ధమళేశ్వరంలో ఘోరం.. ఐదుగురు సజీవదహనం

11 Mar, 2014 06:14 IST|Sakshi

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ధమళేశ్వరంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు సజీవదహనమైయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా  పూరిగుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో భారీ మంటలతో ఎగసిపడుతూ గుడిసె పైకప్పు  నిద్రిస్తున్న వారిపై పడింది. దీంతో ఆ ఐదుగురు మహిళలు బయటికి రాలేక గుడిసెలో అగ్నికి ఆహుతి అయినట్టు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులలో మరొకరిని అక్కడి స్థానికులు ప్రాణాలతో కాపాడారు.

మృతిచెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పినట్టు సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు