ఏదీ ఆహార భద్రత? | Sakshi
Sakshi News home page

ఏదీ ఆహార భద్రత?

Published Wed, Feb 26 2014 2:26 AM

Food Safety scheme not implemented properly

 అరకొర సిబ్బందితో పనులు
 విచ్చలవిడిగా కల్తీ విక్రయాలు
 జిల్లా అంతటా ఇదే పరిస్థితి
     పట్టించుకోని అధికారులు
     భూత్ బంగ్లాగా కార్యాలయం
     పరిసరాలు కూడా శుభ్రం చేసుకోని సిబ్బంది
 
 సుభాష్‌నగర్, న్యూస్‌లైన్:  
 ఆహార భద్రత శాఖకు జబ్బు చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఆహార భద్రతను గాలికొదిలేశారు. దీంతో కల్తీ నిత్యావసర వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం అడపాదడపా నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు సైతం ఉన్నా యి. ప్రజలు ప్రతి రోజూ వినియోగించే పప్పుధాన్యాలు, వంటనూనె, కారంపొడి, శుద్ధ జలం(తాగునీరు)లో అత్యధికంగా కల్తీ జరుగుతోంది. అధికారుల ఉదాసీన వైఖరితో వ్యాపారులు ప్రతి వస్తువును కలుషితం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వంటనూనెలు విడిగా విక్రయించరాదు. అయినప్పటికీ, నగరంలో చాలా చోట్ల వ్యాపారులు విడిగా నూనె  ను విక్రయిస్తున్నారు. ఇందులో చాలా వరకు క ల్తీ జరుగుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధింత అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాల కు తావిస్తోంది.
 
 సూచనలు బేఖాతరు
 ఆహార భద్రత శాఖాధికారుల నుంచి తప్పనిసరిగా లెసైన్సులు తీసుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. ఆన్‌లైన్‌లో లెసైన్సులు తీసుకోవాలని నాలుగు నెలల క్రితం అధికారులు సూచించినప్పటికీ వ్యాపారుల నుంచి స్పందన లేదు. ఇప్పటి వరకు కేవలం 430 మంది వ్యాపారులు మాత్రమే లెసైన్సులు పొందినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
 
 కొరవడిన తనిఖీలు
 జిల్లావ్యాప్తంగా నిత్యావసర వస్తువులలో కల్తీ జరుగుతోంది. వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని ఆహారభద్రత శాఖాధికారులు పట్టించుకోకపోవడంతో వీరి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. తనిఖీలు లేకపోవడం కూడా వారికి వరంగా మారుతోంది. తేలికగా వినియోగదారులను బోల్తాకొట్టిస్తున్నారు. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 తీవ్రంగా సిబ్బంది కొరత
 ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ఈ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ సాకుతో వీరు విధులపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతోపాటు ప్రధాన పట్టణాలైన కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, అన్ని మండల కేంద్రాలలో వేల సంఖ్యలో నిత్యావసర వస్తువుల దుకాణాలు, వందల సంఖ్యలో వాటర్‌ప్లాంట్లు  ఉన్నా యి. వీటిని తనిఖీ చేయాల్సిన ఆహారభద్రత శాఖ మంచం పట్టింది. ఈ శాఖలో ఒక జిల్లా అధికారి, ఒక సేఫ్టీ ఆఫీసర్ (ఇన్‌చార్జీ, ఆదిలాబాద్), ఒక కార్యాలయ ఉద్యోగి, మహిళ అటెండర్ మాత్రమే ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఆహార భద్రత కార్యాలయం భూత్ బంగ్లాను తలపిస్తుంది. పరిసరా లు అపరిశుభ్రంగా ఉంటాయి. ఇది నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియదుకేసులు నమోదు చేస్తున్నాంనిత్యావసర వస్తువులలో కల్తీ జరుగుతున్న విషయం వాస్తవమే. వాటిని నియంత్రించేందుకు కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 80 కేసులు నమోదు చేశాం. 42 మంది వ్యాపారులకు జరిమానాలు విధించాం. ఏడాదికి రూ. 12 ల క్షల ఆదాయం ఉన్న వ్యాపారులు మాత్రమే మా శాఖ ద్వారా లెసైన్సులు తీసుకోవాలి. కేసులు నమోదు చేయాలని మాకు ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ఆదేశాలంటూ ఏమి లేవు.
 - అమృతశ్రీ, జిల్లా ఆహారభద్రత అధికారి
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement