గది కోసం గన్‌తో బెదిరింపులు | Sakshi
Sakshi News home page

గది కోసం గన్‌తో బెదిరింపులు

Published Sat, Jun 25 2016 1:36 AM

గది కోసం గన్‌తో బెదిరింపులు - Sakshi

ఆలయ ఉద్యోగిపై  రిటైర్‌‌డ ఉన్నతాధికారి దౌర్జన్యం!
పోలీసుల విచారణ

 
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలోని అతిథి భవనాల్లో అద్దె గది ఇవ్వలేదని ఓ రిటైర్డ్ ఉన్నతాధికారి గన్‌తో ఉద్యోగిని గురువారం అర్ధరాత్రి బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో వారి వుధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు చర్చసాగుతోంది. వురోవైపు పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో డీఎస్పీ వెంకటకిశోర్ శుక్రవారం ఆలయు ఈవో భ్రవురాంబతో కలిసి విచారణ చేపట్టారు. ఆలయు అద్దె గదులు ఇస్తున్న ఉద్యోగులను విచారించారు. అంతేకాకుండా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్‌ను పరిశీలించారు. ఆ అధికారికి లెసైన్స్ ఉన్న తూపాకీ ఉండడంతో గతంలో కూడా అనేక సార్లు ఆలయూనికి దర్శనానికి వచ్చే సవుయుంలో తూపాకీని తీసుకువచ్చారని ఆలయూధికారులు అంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలా గన్‌తో బెదిరించలేదని పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయంలో రాత్రి సవుయుంలోను ఆలయు భద్రత పెంచాల్సి ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

 
గన్‌మెన్లు ఉన్నారని చెప్పారు

అద్దె గది ఇవ్వాలని కడప జిల్లాకు చెందిన ఓ వూజీ ఉన్నతాధికారి గురువారం రాత్రి ఆలయు ఉద్యోగిని కోరారని డీఎస్పీ వెంకటకిశోర్ తెలిపారు. ఆయున నిర్లక్ష్యంగా సవూధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వా దం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ మా జీ ఉన్నతాధికారి తనకు గన్‌తోపాటు గన్‌మెన్లు ఉన్నారని, తాను ప్రొటోకాల్ ఉన్న వ్యక్తిగా చెప్పారని, గన్‌తో ఆలయు ఉద్యోగిని బెదరించలేదని తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆలయ ఈవో భ్రమరాంబతో కలిసి ఆలయుంలో విచారణ చేశామన్నారు.

 

 

Advertisement
Advertisement