ఆధిపత్యం కోసం ఆరాటం | Sakshi
Sakshi News home page

ఆధిపత్యం కోసం ఆరాటం

Published Sun, Sep 21 2014 2:58 AM

ఆధిపత్యం కోసం ఆరాటం - Sakshi

  • నియోజకవర్గాల్లో పట్టు పెంచుకోవాలి   
  •  తొలి సమావేశంలో అధికార పార్టీ ఎంపీల నిర్ణయం
  •  కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై చర్చ
  •  నివురుగప్పిన నిప్పులా విభేదాలు
  • సాక్షి,విజయవాడ : రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తమ పట్టు పెంచుకోవాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. ఇందుకోసం సమష్టిగా వ్యూహాలు రచించడం, మంత్రులను, ఎమ్మెల్యేలను కలుపుకుని పనిచేయడం, కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలకు మధ్యవర్తిగా ఉంటూ నిధులు రాబట్టడం.. తద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలని  భావిస్తున్నారు.  ఇందులో భాగంగా శనివారం విజయవాడలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు  చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు.  కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, దేవేందర్‌గౌడ్, చిత్తూరు ఎంపీ  ఎం.శివప్రసాద్ సమావేశానికి గైర్హాజరయ్యూరు.
     
    ఇక ప్రతి నెలా సమావేశాలు..


    ఇక నుంచి పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ప్రతి నెలా  ఎంపీ లంతా సమావేశ మై పలు అంశాలను చర్చించాలని సమావేశంలో  నిర్ణయించారు. రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఖర్చు చేసే విషయంలోనూ కీలక పాత్ర పోషించాలని, జిల్లాల అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం నూతనంగా ఏర్పాటు చేసిన ఫోరమ్స్‌లో టీడీపీ ఎంపీలకు అవకాశాలు లభించినందున నియోజకవర్గ సమస్యలను ఆయా శాఖల  మంత్రుల దృష్టికి తీసుకువె ళ్లి సాధ్యమైనంత ఎక్కువ నిధులు రాబట్టాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళితే ఆయన వెంట ఎంపీల బృందం వెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలను ఇక్కడ సమర్ధంగా అమలు చేసేటట్లు చూడాలని ఎంపీలు చర్చించుకున్నారు.
     
    బందరు పోర్టు కోసం ఎంపీల పట్టు ...

    బందరు పోర్టు పనులను సతర్వమే ప్రారంభించాలని ఎంపీలు కొనకళ్ల   నారాయణరావు, కేశినేని శ్రీనివాస్ (నాని) పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ పోర్టు అభివృద్ధి  ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, బందరుపోర్టు, విజయవాడ అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, బైపాస్ రోడ్ల అవసరం గురించి సమావేశంలో చర్చించారు. వీటి నిర్మా ణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే రాజధాని అభివృద్ధి వేగవంతం అవుతుందని ఎంపీలు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన నిధుల్ని సాధ్యమైనంత త్వరగా రాబట్టాలని నిర్ణయించారు.
     
    రెండు గ్రూపులు..


    టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌ల నాయకత్వంలో రెండు గ్రూపులుగా చీలిపోరుునట్లు తెలిసింది. సమష్టిగా పనిచేయాలని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, లోలోపల మాత్రం ఎవరి ఎజెండాలు వారు అమలు చేస్తున్నట్లు తెలిసింది. ఎవరికి వారు తమ పట్టుపెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు  జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఆధిపత్య  పోరు చంద్రబాబు అదుపులో ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఇటువంటి సమావేశాల వల్ల పోరు తీవ్రతరమై అధినేతకు తలనొప్పిగా మారుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Advertisement
Advertisement