బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం

Published Fri, Mar 4 2016 4:32 AM

forced land acquisition Against

9న చలో విజయవాడ

 ఒంగోలు టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం భూ బ్యాంకు పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రామకోటేశ్వరరావు, పమిడి వెంకట్రావు వెల్లడించారు. గురువారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశం వివరాలు వారు వెల్లడించారు. జిల్లాలో పారిశ్రామిక కారిడార్ పేరుతో దొనకొండలో 25వేల ఎకరాలు, నిమ్జ్ పేరుతో పీసీపల్లిలో 14వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం పూనుకుందన్నారు. జిల్లాకు ఏ పరిశ్రమలు వస్తాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయన్న విషయమై స్పష్టత లేకుండా పోరుుందన్నారు. 

రైతుల నుంచి బల వంతంగా భూములను లాక్కుంటున్నారని విమర్శిం చారు. పొగాకు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బోర్డు వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పొగా కు ప్రస్తుతం కేజీ రూ.123లకు కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కేజీకి గరిష్ట రేటు రూ.180 , సగటు రేటు రూ. 160లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 గోపీనాథ్ తొలగింపు
 ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా శాఖ నుంచి దుగ్గినేని గోపీనాథ్‌ను తొలగించినట్లు అధ్యక్ష, కార్యదర్శులు కందిమళ్ల రామకోటేశ్వరరావు, పమిడి వెంకట్రావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీలో కొనసాగుతున్న గోపీనాథ్ సొంతంగా రైతుసంఘాన్ని ఏర్పాటు చేసుకొన్నారన్నారు. దీంతో ప్రాథమిక సభ్యత్వం నుంచి, సంఘం బాధ్యతల నుంచి తొలగిస్తూ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘానికి, గోపీనాథ్‌కు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement