ఓటర్ల షాక్ తో 'కోట్ల'వారు సేద్యానికి ఓటేశారు! | Sakshi
Sakshi News home page

ఓటర్ల షాక్ తో 'కోట్ల'వారు సేద్యానికి ఓటేశారు!

Published Wed, Jul 2 2014 1:22 PM

ఓటర్ల షాక్ తో 'కోట్ల'వారు సేద్యానికి ఓటేశారు! - Sakshi

రాష్ట్ర విభజన అంశం గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్ తో కాంగ్రెస్ పార్టీ నేతల జాతకాలు తారమారయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖతోపాటు కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి తాజా ఎన్నికల్లో దారుణమైన పరాజయం ఎదురవ్వడంతో ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. 
 
కర్నూలు రాజకీయ చరిత్రలో కోట్ల కుటుంబానికి ఊహించని ఓటమి ఎదుర్వడంతో దేశరాజధానిలోని అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. ఢిల్లీలో తన స్నేహితులకు భారీ విందును కూడా ఏర్పాటు చేశారు. ఈ విందుకు సుమారు ఓ 500 మందిని ఆహ్వానించారు కూడా. ఓటమి తర్వాత ఢిల్లీ నుంచి మకాం మార్చి కర్నూలులోని లద్దగిరికి సమీపంలో వెల్దుర్తిలో వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన వ్యవసాయాన్ని వదులుకోలేదని ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను 50 ఎకరాల్లో మామిడి తోటలో సేద్యం చేస్తున్నానని,  25 రకాల మామిడి పండ్లను పండిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన గతంలో రెండు ఆవులను కొన్నామని.. ప్రస్తుతం ఫామ్ హౌజ్ లో కనీసం 100 ఆవులన్నాయని తెలిపారు. 
 
అయితే రాజకీయంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న కోట్ల కుటుంబం.. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి భార్య సుజాతమ్మ కూడా ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సీమాంధ్రలో పార్టీని కాంగ్రెస్ పణం పెట్టిందని.. అయితే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ లాభపడకపోవడం ఆయన ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు మారుతాయని కోట్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement