సివిల్స్‌లో సత్తాచాటిన రైతు బిడ్డ | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో సత్తాచాటిన రైతు బిడ్డ

Published Fri, Jun 13 2014 2:34 AM

సివిల్స్‌లో సత్తాచాటిన రైతు బిడ్డ - Sakshi

- వేంపల్లె మహేంద్రకు 694 ర్యాంకు
- ఐపీఎస్ లేదా ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యే అవకాశం

మదనపల్లె రూరల్: సివిల్స్ ఫలితాల్లో మదనపల్లె మండలానికి చెందిన రైతు బిడ్డ తంబా మహేంద్ర సత్తాచాటాడు. జాతీయస్థాయిలో 694వ ర్యాంకును సాధించాడు.  మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీ తాలిపల్లెకు చెందిన  రైతు కూలీ తంబా జగదీశ్వర్, కుప్ప మ్మ దంపతుల పెద్ద కుమారుడు మహేంద్ర. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ మదనపల్లె బీటీ కళాశాలలో చదివారు. శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు.

ప్రయివేటు సంస్థలో పనిచేస్తూ  గత ఏడాది డిసెంబర్‌లో  సివిల్స్ మెయిన్ పరీక్ష రాశారు. వాటి ఫలితాలు గురువారం వెలువడ్డాయి. 694వ ర్యాంకు సాధించారు. ఈయన ఐపీఎస్ లేదా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది.  2010 నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధిం చాడు. తమ గ్రామానికి చెందిన రైతుబిడ్డ సివిల్స్‌లో ర్యాంకు సాధించారని తెలుసుకుని గ్రామస్తులు హర్షాన్ని వెలిబుచ్చారు. చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబర్చే మహేంద్ర కష్టపడి ఉన్నత చదువులు చదివాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
Advertisement