నాల్గో తరగతి విద్యార్థినికి రూ.లక్ష బహుమతి | Sakshi
Sakshi News home page

నాల్గో తరగతి విద్యార్థినికి రూ.లక్ష బహుమతి

Published Sat, Dec 27 2014 12:45 AM

Fourth class student lakh reward

సాక్షి-ఎస్సార్ షాపింగ్ మాల్
పండుగ సంబరాల్లో వరించిన అదృష్టం
 

 గాజువాక : సాక్షి-ఎస్సార్ షాపింగ్ మాల్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పండుగ సంబరాల మూడోరోజు డ్రాలో లక్ష రూపాయల బంపర్ బహుమతి నాల్గో తరగతి విద్యార్థినిని వరించింది. గాజువాక ఎస్సార్ షాపింగ్ మాల్‌లో శుక్రవారం నిర్వహించిన డ్రాలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డ్రా తీసి విజేతను ఎంపిక చేశారు. సాక్షి ఎంపిక చేసిన షోరూమ్‌లలో మూడోరోజు కొనుగోలు చేసిన వినియోగదారుల కూపన్లనుంచి డ్రా తీసి విజేతను ప్రకటించారు. ఈ డ్రాలో ఓలివ్ పెరల్‌కు బంపర్ డ్రా పలకడంతో ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి ఆ విషయాన్ని తెలిపారు. విజేతకు శుభాకాంక్షలు చెప్పారు. మిలట్రీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్)లో జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ముత్యాలరావు తన కుమార్తె ఓలివ్ పెరల్‌తో కలిసి గోపాలపట్నంలోని ఎస్సార్ షాపింగ్ మాల్‌లో గురువారం రూ.3,484 విలువైన వస్త్రాలను కొనుగోలు చేశారు. రెండోరోజు డ్రాలో లక్ష రూపాయలు గెల్చుకున్న బి.ఎ.సూర్యనారాయణతోపాటు పలువురు ప్రముఖుల సమక్షంలో కన్సోలేషన్ బహుమతులకు డ్రా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాక్షి-ఎస్సార్‌షాపింగ్ మాల్ కాన్సెప్ట్ తనకు ఎంతగానో నచ్చిందన్నారు. రోజుకొకరికి లక్ష రూపాయల చొప్పున 15 రోజులకు 15 లక్షల రూపాయలు వినియోగదారులకు ఇవ్వడం అభినందించదగిన విషయమన్నారు. పండుగ 15 రోజులు వినియోగదారులకు ఆనందం లభిస్తుందన్నారు. పండుగపూట ఏదో ఒక బహుమతి వస్తే ఆ ఆనందమే వేరన్నారు. బంపర్ డ్రాను అత్యంత పారదర్శకంగా నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు.
 అన్ని బ్రాంచిల్లోను అనూహ్య స్పందన
 పండుగ సంబరాల సందర్భంగా గాజువాక, అనకాపల్లి, గోపాలపట్నం, జగదాంబ జంక్షన్‌లలో గల తమ ఎస్సార్ షాపింగ్ మాల్ అమ్మకాలకు అనూహ్య స్పందన లభిస్తోందని ఆ షోరూమ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఆర్.గోపీనాథ్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఇతర షోరూమ్‌లకు కూడా ఇదే ఆదరణ లభిస్తోందన్నారు. బంపర్ డ్రాతోపాటు పలు కన్సోలేషన్ బహుమతులు కూడా తమ షోరూమ్‌లలో కొనుగోలు చేసిన వినియోగదారులకు రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో గాజువాక ట్రాఫిక్ సీఐ సిహెచ్.ప్రసాద్, గాజువాక వర్తక సంఘం అధ్యక్షుడు తిప్పల చిన అప్పారావు, భారత వికాస్ పరిషత్ గాజువాక అధ్యక్షుడు పేరం రామకృష్ణారెడ్డి, సాక్షి ఏజీఎంలు రంగనాథ్ (యాడ్స్), వి.ఆర్.నరేంద్రబాబు (సర్క్యులేషన్), బెస్ట్ వెస్టర్న్ రామచంద్ర మేనేజింగ్ డెరైక్టర్ జి.రఘు, మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement