కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలి | Sakshi
Sakshi News home page

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలి

Published Tue, Mar 4 2014 3:30 AM

Free education from KG to PG


 మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ  : తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే ఉచిత విద్యనందించాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అధ్యక్షుడు జేఎల్ గౌతంప్రసాద్ పేర్కొన్నారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళ డిగ్రీ కళాశాలలో తెలంగాణ విజయోత్సవ సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పీడీఎస్‌యూ క్రియాశీలకంగా ఉద్యమాలు చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్ర పున ర్నిర్మాణంలో విద్యారంగ సమస్యలు, నాణ్యమైన విద్యనందించాలన్నారు. తెలంగాణలోని బీడు భూములు సాగునీరందించి సస్యశ్యామలం చేయాలన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి రాములు మాట్లాడుతూ మహిళలపై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

దేశంలో జరుగుతున్న హింస, అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అవినీతిరహిత సమాజాన్ని సాధించేందుకు విద్యార్థులు పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన్‌పల్లి గణేష్, నాయకులు గణిత, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.
- పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం ప్రసాద్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement