Sakshi News home page

పోలీసులనే బురిడీ కొట్టించారు

Published Fri, Nov 7 2014 4:22 AM

ganavaram court at police shock

విజయవాడ సిటీ : రాష్ట్రంలో సంచలనం కలిగించిన పెద అవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసు నిందితుల అరెస్టులో పోలీసులను మధ్యవర్తులు బురిడీ కొట్టించారు. నిందితులు నేరుగా తమ వద్దకే వచ్చి లొంగిపోతారని పోలీసులు ధీమాతో ఉన్నారు. వారి దిమ్మ తిరిగేలా ఆరుగురు నిందితులు కోర్టులో లొంగిపోయి ఝలక్ ఇచ్చారు. ఏలూరుకు చెందిన తమ న్యాయవాది ద్వారా ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులైన పురాణం గణేష్, ఊరా గోపి, తూరపాటి పెదబాబు, సిరిగిరి గోపరాజు, కిన్నెర శ్రీను, చేజర్ల వెంకటేష్ గురువారం ఉదయం గన్నవరం కో ర్టులో లొంగిపోయారు. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.  

ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై గత సెప్టెంబర్ 24న జరిగిన గంధం నాగేశ్వరరావు, ఆయన ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్య హత్య కేసులో 22 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిలో ఢిల్లీకి చెందిన కిరాయి హంతకులు ఎనిమిది మంది కాగా.. మిగిలిన వారు పినకడిమి గ్రామానికి చెందిన కుట్రదారులు. ప్రధాన కుట్రదారుడు భూతం గోవింద్ విదేశాల్లో తల దాచుకోగా.. మిగిలిన వారు ఈ హత్యల తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు.. ఈస్ట్‌జోన్ ఏసీపీ ఉమామహేశ్వరరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు. కేసులో ఆధారాల సేకరణ, నిందితుల పట్టివేతను సిట్‌కు అప్పగించారు.
 
అరెస్టయింది వీరే
సిట్ ఏర్పాటుకు ముందే ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల సాయంతో కిరాయి షూటర్స్ ప్రతాప్‌సింగ్ అలియాస్ అనుజ్, ధరమ్‌వీర్ అలి యాస్ సల్లు, నితిన్, నీరజ్‌తో పాటు కుట్రదారులతో ఒప్పందం చేసుకున్న మంజిత్‌సింగ్, సతీష్‌కుమార్, పంకజ్ అలియాస్ ప్రకాష్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు  పరారీలో ఉన్నాడు. సిట్ బృందం పినకడిమి గ్రామానికి చెందిన భూతం బాలాజీ, పాస్తం మహేష్, పాలపాటి శివను అక్టోబర్ 16వ తేదీన అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు
 ‘సిట్’ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతూ గాలి స్తోంది. ఈ బృందం కళ్లుగప్పి ఆరుగురు నింది తులు గురువారం కోర్టులో లొంగిపోయారు.  
 
ఏమార్పు
నిందితులకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉన్నట్టు తెలిసింది. వీరు లొంగిపోనున్నారనే సమాచారంతో మధ్యవర్తులు విధిం చిన  షరతులకు పోలీసులు అంగీకరిం చినట్లు చెబుతున్నారు. నిందితులు నేరుగా వచ్చి తమ వద్ద లొంగిపోతారనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఎలాగు వచ్చి లొంగిపోతారనే ఉద్దేశంతో సిట్ బృందం వీరిపై పెద్దగా దృష్టి సారించలేదు.ఈ క్రమంలో ముందుగా ఇచ్చిన మాటకు విరుద్ధంగా కోర్టులో లొంగిపోవడంతో పోలీసులు ఖిన్నులయ్యారు. ఈ అంశంపై మధ్యవర్తుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన పోలీసులు.. మిగిలిన వారినైనా పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.

Advertisement
Advertisement