గ్యాస్, ఆధార్ సీడింగ్‌లో ఫస్ట్ | Sakshi
Sakshi News home page

గ్యాస్, ఆధార్ సీడింగ్‌లో ఫస్ట్

Published Sat, Dec 28 2013 2:45 AM

gas, Aadhaar Seeding First

సాక్షి, కాకినాడ :గ్యాస్, ఆధార్ సీడింగ్ 92 శాతం, బ్యాంక్ సీడింగ్ 86 శాతం పూర్తి చేయడం ద్వారా తూర్పుగోదావరి జిల్లా దేశంలోనే ప్రథమ స్థానం పొందిందని కలెక్టర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరే ట్ ఆవరణలో ఆధార్ ఎల్‌పీజీ ప్రత్యక్ష లబ్ధి బదిలీపై బ్యాంకర్లు, గ్యాస్‌డీలర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. గ్యాస్ ఏజెన్సీల వారీగా సీడింగ్‌ను ఆమె సమీక్షించారు. జిల్లాలో అడ్రస్ దొరకని, వలస వెళ్లిన, ఇంటికి తాళం వేసిన లేదా చనిపోయిన కారణాలతో 5వేల మంది బోగస్ వినియోగదారులు ఉన్నారన్నారు. నూరుశాతం వివరాలు సేకరించి అనర్హులను జాబితా నుంచి తొలగిస్తే సీడింగ్ స్థాయి మెరుగు పడుతుందన్నారు. సీడింగ్‌కు సంబంధించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే సక్రమంగా పరిష్కరించాలన్నారు. జేసీ ముత్యాలరాజు మాట్లాడుతూ దీపం కనెక్షన్ల లబ్ధిదారులు చనిపోతే వారి పిల్లలకు వారసత్వ హక్కుగా కనెక్షన్ ఇవ్వాలని సూచించారు. 
 
 ఇన్‌పుట్ సబ్సిడీ జమ
 నీలం తుపానుకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీకింద ఇచ్చిన రూ.138 కోట్లను 2లక్షల 95 వేల 712 మంది బ్యాంకు ఖాతాలకు జమచేయాల్సి ఉండగా 2 లక్షల 47 వేల 46 మంది ఖాతాలకు రూ.116.70 కోట్లు జమ చేశామని కలెక్టర్ చెప్పారు. 42 వేల 338 బ్యాంకు ఖాతాలు మిస్ మ్యాచ్ అయినందున మళ్లీ పరిశీలించి పంపుతామన్నారు. డీఆర్‌ఓ బి.యాదగిరి, ఎల్‌డీఎం జగన్నాథస్వామి, డీఎస్‌ఓ రవికిర ణ్ పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement