జనవరి 1 కల్లా అన్ని జిల్లాల్లో గ్యాస్‌కు నగదు బదిలీ | Sakshi
Sakshi News home page

జనవరి 1 కల్లా అన్ని జిల్లాల్లో గ్యాస్‌కు నగదు బదిలీ

Published Thu, Sep 12 2013 2:40 AM

Gas Cash transfer scheme to be Implemented by january 1 in all districts

 వచ్చే నెల నుంచి మరో  8 జిల్లాల్లో పథకం
 సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్‌కు నగదు బదిలీని జనవరి 1కల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఇప్పటికే రెండు దశల్లో 12 జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉండగా, వచ్చే నెల 1 నుంచి మరో 8 జిల్లాల్లో (కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు, వరంగల్, మెదక్, నల్లగొండ, విశాఖపట్టణం) జిల్లాల్లో అమల్లోకి రానుంది. నవంబర్ 1 నుంచి మహబూబ్‌నగర్, విజయనగరం జిల్లాల్లో అమలుచేయనున్నారు.
 
 వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో అమల్లోకి తేనున్నారు. నగదు  బదిలీ ప్రారంభించిన నాటి నుంచి మూడు నెలల్లోగా వినియోగదారులు బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి. అప్పటివరకు అనుసంధానం చేయకపోయినా సబ్సిడీని ఇస్తారు. మూడు నెలలు తరువాత కూడా ఆధార్‌ను బ్యాంకు అకౌంటుకు అనుసంధానం చేయని వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వరు. మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఆధార్‌ను బ్యాంకు లింకేజి చేసుకుంటే అప్పటి నుంచి వంట గ్యాస్ సబ్సిడీని అందజేస్తారు.

Advertisement
Advertisement