గౌరీపట్నం వంతెనకు ముప్పు | Sakshi
Sakshi News home page

గౌరీపట్నం వంతెనకు ముప్పు

Published Fri, Jun 6 2014 11:57 PM

గౌరీపట్నం వంతెనకు ముప్పు

  • ఇసుక తవ్వకాలతో ప్రమాద ఘంటికలు
  •  కూలేందుకు సిద్ధంగా ఉన్న స్తంభాలు
  •  కోరుకుపోయిన ఇరువైపుల ఒడ్డు
  •  చోడవరం,న్యూస్‌లైన్ : నదిపై వంతెన లేక రాకపోకలకు నానా అవస్థలు పడ్డ రోజులవి. నేడు ఉన్న వంతెనను కూలదోసుకునే దుస్థితి. ఇసుక అక్రమ వ్యాపారమే లక్ష్యంగా కొందరు గ్రామస్థులు వ్యవహరిస్తున్న తీరు  చివరికి ఆ గ్రామానికి రాకపోకలే నిలిపోయే పరిస్థితికి దారితీసేలావుంది. చోడవ రం మండలం గౌరీపట్నం పేరు చెబితే అందరికీ గుర్తుకొచ్చేది ఇసుక అక్రమ వ్యాపారం.

    ఈ గ్రామం ప్రక్క నుంచే పెద్దేరు నది ప్రవహిస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన చోడవరానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఒకప్పుడు వెళ్లాలంటే పెద్దేరు నది లోంచి కాలినడకే శర ణ్యం. నదిపై వం తెన లేకపోవడంతో నదిలో నీటి ప్రవాహం పెరిగినా, వరదలు వ చ్చినా ఈ గ్రామానికి బయట ప్రపంచంతో సం బంధాలు తెగిపోయేవి. రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు నరకయాతన పడేవారు.

    ఈ పరిస్థితుల్లో  బలిరెడ్డి సత్యారావు మంత్రిగా ఉన్నప్పుడు పెద్దే రు నదిపై వంతెన నిర్మించి గౌరీపట్నానికి బయట ప్రపంచంతో సంబంధా లు కలిపారు. ఇప్పుడు మరలా ఈ గ్రామానికి బయట ప్రపంచంతో సం బంధాలు తెలిగిపోయే పరిస్థితి పొంచి వుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదా యం వచ్చే ఇసుక అక్రమ రవాణాకి ఈ గ్రామస్తులు కొన్నేళ్లుగా పాల్పడుతుండటంతో గ్రామానికి ఆనుకుని ఉన్న పెద్దేరు నదిని తవ్వేసి ఇసుక వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలు గా సాగిస్తున్నారు.

    ఈ వ్యాపారం గ్రా మమంతటికీ పాకింది. ఎవరికి తోచి నంత వారు నదిని, నది గర్భంలో ఉ న్న ఇసుకను తవ్వేసి యథేచ్ఛగా వ్యా పారం చేసుకుంటున్నారు. ఈ క్రమం లో వంతెన ఉన్న ప్రదేశంలో కూడా ఇసుకను తవ్వేయడంతో నాలుగేళ్లుగా వరుస తుఫాన్ల వరద తాకిడికి వంతెన వద్ద ఇరు ప్రక్కల గట్లు పూర్తిగా కోతకు గురయ్యాయి. అంతేకాకుండా నదీ గర్భం కూడా కోతకు గురై బాగా లోతవ్వడం వల్ల ప్రస్తుతం వంతెన స్తంభా లు అడుగుభాగం కనిపిస్తున్నాయి.

    మరోపక్క రెండు గట్లు భారీగా కోతకు గురై గండ్లు పడటంతో వంతెన చివరి బాగాలు కూడా బీటలువారి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నదిలో నీటి ప్రవాహ ఉద్ధృతి పెరిగితే స్తంభాలు ఏ క్షణమైనా కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. రానున్నది వర్షాకాలం కావడంతో పైన ఉన్న కొండగెడ్డల్లో భారీగా వర్షాలు కురిసినా పెద్దేరు పొంగి ప్రవహించే అవకాశం ఉంది.

    ఈ పరిస్థితుల్లో వంతెన భవిష్యత్తుపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. వంతెనకు ఏదైనా జరిగితే గౌరీపట్నానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఇప్పటికే మధ్య స్తంభాల్లో ఒకటి కాస్త కుంగడంతో  వంతెన పైభాగం రోడ్డు బీటలు వారింది. మరమ్మతులు చేపడతామని అధికారులు చెబుతున్నా చర్యలు మృగ్యం.

    ఇటు బీఎన్‌రోడ్డులో బొడ్డేరు అప్రోచ్ రోడ్డు దెబ్బతిన్నప్పుడల్లా గౌరీపట్నం వంతెనపైనుంచే వాహనాలు మళ్లిస్తారు. ఈ సమయంలో వెంతనకు తాకిడి మరింత పెరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
     

Advertisement
Advertisement