హంద్రీనీవా పనుల్లో అపశృతి | Sakshi
Sakshi News home page

హంద్రీనీవా పనుల్లో అపశృతి

Published Wed, May 18 2016 5:56 PM

gelatin sticks explosion in handriniva works

-జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరికి గాయాలు

వి.కోట: హంద్రీనీవా పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. చిత్తూరు జిల్లా వి.కోట మండలం పత్తేర్లమాకులపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. హంద్రీనీవా కాలువలో అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్‌తో పేలుళ్లు జరిపారు. దీంతో బండ రాళ్ల ముక్కలు ఎగిరి సమీపంలోని రైతుల ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం(55), నరేంద్ర (16)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఆగ్రహంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement