టీడీపీలో కొనసాగుతున్న రాజీనామాలు | Sakshi
Sakshi News home page

టీడీపీలో కొనసాగుతున్న రాజీనామాలు

Published Mon, Aug 7 2017 3:52 PM

టీడీపీలో కొనసాగుతున్న రాజీనామాలు - Sakshi

గిద్దలూరు: తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాముఖ్యత ఇస్తుండటంతో నేతలతోపాటు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు పార్టీలో, అధినేత దగ్గర తగిన విలువ, ప్రాధాన్యత లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కార్యక్రామాలకు పిలవకపోవడం, కావాలని దూరం పెట్టడం వంటివి స్థానిక నేతలకు నచ్చడంలేదు.

ఈనేపథ్యంలోనే పలువురు నేతలు తెలుగుదేశానికి రాజీనామా చేస్తున్నారు. తాజా నంద్యాల ఉప ఎన్నికల కార్యక్రమాలకు ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డిని కాదని భూమా అఖిల ప్రియకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్సీగా గెలిచి 90రోజులు కూడా కాకముందే  శిల్పా చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు తన అనుచరులు సైతం పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే.

అలాగే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయిన అన్నా రాంబాబు సైతం ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. నియోజక వర్గంలో మొదటి నుంచి ఉంటున్న తనను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డికి ప్రాముఖ్యత ఇస్తుండటంతో ఆయన కొంత కాలంగా తీవ్ర సంతృప్తితో ఉన్నారు. దీంతో అన్నా రాంబాబు ఈ నెల 5న పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై ఘాటుగానే విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా ఆయనకు మద్దతుగా నియోజక వర్గం నుంచి సుమారు 200మంది స్థానిక నేతలు, వందలాది మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు.

ఇంకా చదవండి: టీడీపీకి రాజీనామా చేస్తున్నా

Advertisement
Advertisement