పైలాన్ ఆవిష్కరించిన చంద్రబాబు | Sakshi
Sakshi News home page

పైలాన్ ఆవిష్కరించిన చంద్రబాబు

Published Wed, Sep 16 2015 12:46 PM

Godavari, Krishna rivers linked by chandrababu niadu in ibrahimpatnam

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద పైలాన్ను ఆవిష్కరించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి 'కృష్ణాగోదావరి పవిత్ర సంగమం' అని ప్రభుత్వం నామకరణం చేసింది.

కాగా గోదావరి మిగులు జలాలను కృష్ణానదికి తరలించే కార్యక్రమంలో భాగంగా తాటిపూడి ప్రాజెక్టు నుండి గోదావరి నీటిని పోలవరం కుడి కాలువకి పంపింగ్ చేస్తారు. ఆ నీళ్ళు వెలగలేరు గ్రామం వద్ద గల భలేరావు చెరువుకి చేరుకొంటాయి. అక్కడి నుండి బుడమేరు కాలువకి మళ్ళిస్తారు. బుడమేరు ద్వారా గోదావరి నీళ్ళు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తాయి.  కాగా ఈ కార్యక్రమ అనంతరం చంద్రబాబు పట్టిసీమ బయల్దేరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement