విభజన సాకుతో నిరుద్యోగులతో ఆటలా?: కృష్ణయ్య | Sakshi
Sakshi News home page

విభజన సాకుతో నిరుద్యోగులతో ఆటలా?: కృష్ణయ్య

Published Thu, Sep 5 2013 2:09 AM

Government is playing with unemployed people, slams R Krishnaiah

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సాకుతో ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక వైఖరిని అవలంభించటం సరికాదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య అన్నారు. ‘టెట్’ను నిర్వహించి, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ డీఎస్సీ కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ బుధవారం జరిగిన ధర్నాలో కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విభజన అంశాన్ని సాకుగా చూపి 6 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం హేయమన్నారు. జిల్లా స్థాయి ఉపాధ్యాయ పోస్టులకు రాష్ట్ర విభజనకు సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఈడీ/డీఈడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రాము, ప్రధాన కార్యదర్శి ఉదయ్, బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ అధ్యక్షులు గుజ్జ కృష్ణ, విద్యార్థి సంఘం అధ్యక్షులు ర్యాగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement