వైఎస్సార్‌ ఇచ్చిన పింఛన్‌ను రద్దు చేశారు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఇచ్చిన పింఛన్‌ను రద్దు చేశారు

Published Tue, Mar 6 2018 9:59 AM

Govt Cancels Women Pension - Sakshi

ఒంగోలు వన్‌టౌన్‌ : అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కురికుంట్ల సుబ్బమ్మకు వైఎస్సార్‌ హయాంలో మంజూరైన వృద్ధాప్య పింఛన్‌ను చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే రద్దు చేసిందని పాదయాత్రలో జగన్‌ను కలిసి తెలిపింది. తాను వైఎస్సార్‌ అభిమానిననే గ్రామంలోనే జన్మభూమి కమిటీ నా పింఛన్‌ను రద్దు చేశారని ఆమె వాపోయింది.  – కురికుంట్ల సుబ్బమ్మ

మా కాలనీ సమస్యలను తీర్చండి
కందుకూరు రూరల్‌: మా కాలనీలో తాగేందుకు, పంటల సాగుకు సాగర్‌ నీరు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నామని వెంకటాపురానికి చెందిన పలువురు మహిళలు ఆదెమ్మ, రమాదేవి, జయలక్ష్మి, ప్రమీల, సీతాలు, విజయలు వైఎస్‌ జగన్‌ను కలిసి సమస్యను విన్నవించారు. గ్రామంలో బోర్లు వేసి నీరు, సాగర్‌జలాలు అందించాలని కోరారు. – వెంకటాపురం మహిళలు

నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం
ఉలవపాడు: మా గ్రామంలో తాగడానికి, సాగుకు నీరు లేదని నాగులపాడు యస్సీ కాలనీకి చెందిన మహిళలు జగన్‌ను కలసి విన్నవించారు. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్‌తో నీటి సమస్యల గురించి మొరపెట్టుకున్నారు. సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవావాలని కోరారు. – నాగులపాడు గ్రామ మహిళలు.

Advertisement
Advertisement