మహిళలను దుబాయ్ పంపిన కేసులో గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

మహిళలను దుబాయ్ పంపిన కేసులో గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్

Published Sat, Mar 7 2015 9:24 AM

Gulf agents arrested to send women dubai for prostitution

ఏలూరు(పశ్చిమగోదావరి): గల్ఫ్ ఏజెంట్ త్రిమూర్తులను నరసాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విజిట్ వీసాతో ఐదుగురు మహిళలను దుబాయి పంపిన కేసులో  ఏజెంట్ త్రిమూర్తిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను దుబాయి పంపి వ్యభిచారం చేయాలంటూ వారిని బెదరించినట్టు అరబ్సేట్పై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ వ్యవహారాన్ని స్వచ్ఛంద సంస్థ హోమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దాంతో నిందితులపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి హోమంత్రి చినరాజప్ప అదేశించారు.

దుబాయ్ నుంచి మహిళలను రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే దుబాయ్ తీసుకెళ్లిన మహిళలంతా, అమలాపురం, నరసాపురానికి చెందినవారిగా పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement