‘వంట’బట్టించుకోండి | Sakshi
Sakshi News home page

‘వంట’బట్టించుకోండి

Published Sun, Jul 7 2019 8:56 AM

Guntur Collecter Samuel Serious On  Gurukul Teachers - Sakshi

సాక్షి, కారంపూడి(గుంటూరు) : స్థానిక బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు పాఠశాలకు వచ్చిన కలెక్టర్‌ రాత్రి 8.45 వరకు పరిశీలించారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఆహారం బాగోలేదని విద్యార్థులు చెప్పడంతో క్యాటరింగ్‌ వారిపై మండిపడ్డారు. అనంతరం పాఠశాల వేదిక వద్ద విద్యార్థుల అకడమిక్‌ ప్రగతిని పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలడిగిన కలెక్టర్‌ ఇంగ్లిషు మీడియంలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. తాను పదో తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నానని, గురుకులాలలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తరగతి గదులు తక్కువగా ఉన్నాయని కలెక్టర్‌కు ప్రిన్సిపల్‌ గిరికుమారి విన్నవించారు. 

వసతులలేమిపై ఆరా
.అనంతరం స్టాఫ్‌తో సమీక్ష నిర్వహించారు. 1983లో స్థాపించిన పాఠశాల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి సమకూరలేదని, స్టాఫ్‌కు క్వార్టర్స్‌ లేవని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల ముందు శిథిల భవనాలు ప్రమాదభరితంగా ఉన్నాయని, లైట్లు, ఫ్యాన్లు సక్రమంగా లేవని, వెంటనే వాటిని వాటిని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్, ఎస్‌ఐ మురళి స్థానిక అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement