అంబేడ్కర్ అందరికీ పూజ్యనీయుడు | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్ అందరికీ పూజ్యనీయుడు

Published Sat, Apr 9 2016 1:36 AM

అంబేడ్కర్ అందరికీ పూజ్యనీయుడు - Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి  లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరులో ప్రారంభమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వారోత్సవాలు

 
పట్నంబజారు(గుంటూరు): దేశంలోని అన్ని కులాలు, మతాలు, జాతుల ఉమ్మడి పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగమని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అనేక దేశాలకు స్ఫూర్తిగా నిలిచిన అతి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరికీ పూజ్యనీయుడని కొనియాడారు. అంబేద్కర్ జయంతి వారోత్సవాలను శుక్రవారం ప్రారంభించారు. లాడ్జిసెంటర్‌లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచినీళ్లతో శుభ్రం చేశారు. అనంతరం స్వయంగా చీపురు చేపట్టి ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు.  అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు.


అంబేడ్కర్ ఆశయాన్ని  అవమానిస్తున్నారని ఆవేదన చెందారు. పార్టీ నేతలు పానుగంటి చైతన్య, పేటేటీ నవీన్‌బాజీ, వినోద్, విఠల్, రబ్బాని, నరాలశెట్టి అర్జున్ నేతృత్వంలో జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.నసీర్ అహ్మద్, సంయుక్త కార్యదర్శి షేక్ గులాం రసూల్, లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, కొత్తాచిన్నపరెడ్డి, జగన్‌కోటి, గనిక ఝాన్సీరాణి, యరమాల విజయకిషోర్, దేవరాజ్, మేరువ నర్సిరెడ్డి, మేళం ఆనందభాస్కర్,త దితరులు పాల్గొన్నారు. కోబాల్డ్‌పేటలో అంబేద్కర్ విగ్రహానికి అప్పిరెడ్డి స్వయంగా రంగులు వేశారు.

వార్డు నేతలు జగన్‌కోటి, షేక్ సైదా, రాజు, రంజుల శ్రీనివాస్, మేళం ఆనందభాస్కర్, తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కేవీపీ కాలనీలోని జోసఫ్‌నగర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి జయంతి వారోత్సవాలు నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షుడు కొండారెడ్డి నాగేశ్వరరావు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement