వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గురునాథ రెడ్డి

7 Sep, 2017 17:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనంతపురం(అర్బన్‌) అసెంబ్లీ నియోజక వర్గానికి నూతన సమన్వయ కర్త, కో-ఆర్డినేటర్‌లను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. నియోజక వర్గ సమన్వయ కర్తగా నదీమ్‌ అహ్మద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వారి నియామకాన్ని తెలియచేస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటివరకూ  నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.

మరిన్ని వార్తలు