‘సీఎం జగన్‌ మా ఆశలను చిగురింపజేశారు’

18 Feb, 2020 13:01 IST|Sakshi

వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో దశ ప్రారంభం

రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న సీఎంకు ధన్యవాదాలు

ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌

సాక్షి, కర్నూలు: ‘ఏ సీఎం అయినా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి మరిచిపోతారు. కానీ, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చి.. న్యాయ రాజధానిగా ప్రకటించిన తరువాత కర్నూలుకు వచ్చారు’ అని కర్నూలు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత హఫీజ్‌ఖాన్‌ పేర్కొన్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం మూడో దశను సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం కర్నూలులో లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

మూడో దశ వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని కర్నూలు నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉన్నారు. ఈ పథకం మూడో దశలో భాగంగా దాదాపు 56.88 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి తమ జిల్లా ప్రజల ఆశలను చిగురింపజేశారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని హఫీజ్‌ ఖాన్‌ స్పష్టంచేశారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు జిల్లా ప్రజలు, నాయకులు ఘన  స్వాగతం పలికారు.  

కాగా, రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

చదవండి:
అవ్వాతాతలకు వైఎస్సార్‌ కంటి వెలుగు


నైపుణ్య కేంద్రాలతో పారిశ్రామిక ప్రగతి


ఆయన పత్తిగింజని నమ్మించడానికి ఏ స్థాయికైనా..!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు