28న హమాలీల సమ్మె | Sakshi
Sakshi News home page

28న హమాలీల సమ్మె

Published Mon, Jun 23 2014 1:23 AM

Hamalies strike on 28th

సాక్షి, హైదరాబాద్:  జీవో నెంబర్ 26 ప్రకారం హమాలీ చార్జీలను వెంటనే పెంచకపోతే ఈ నెల 28 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని, 30న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట భారీధర్నా నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమ్మె, ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను యూనియన్ నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించారు.  వెంటనే హమాలీ లోడింగ్, అన్‌లోడింగ్‌కు రూ.8 నుండి రూ.18కి పెంచాలని, మెడికల్ ఇన్సూరెన్స్ కార్డులు అందించాలనిడిమాండ్ చేశారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement